మా అక్కయ్య కూతురు సిధ్ధ సమాధి యోగాలో పదేళ్ళనించీ వుంటోంది..
ఆస్తమా అటాక్ అయిందామె టీనేజ్ లో..
అప్పటినుంచీ యోగాలో వాళ్ళ ఫామిలీ ..ఫామిలీ..అంతా..సెటిలైపోయారు..
మొదలు మైండులో రక్త ప్రసరణ లేదన్నారట..తరువాత మెదడులో క్యాన్సరన్నారట..చివరికి అది ఆస్ఠమాగా తేలింది..
బ్రతకనే బ్రతకదన్న పిల్ల ఇద్దరు బిడ్డల తల్లై ..చక్కగా ఉద్యోగం
చేసుకుంటూంది..ప్రాణాయామం ..ఆసనాలు..ఆమె జీవితాన్ని ..నిలిపాయి మరి..
రా.. అక్కా.. మా యోగ కాంప్ కని తీసికెళ్ళింది..
ఆ రోజు చివరి రోజుట..
పది రోజులూ పిల్లలను వాళ్ళ దగ్గరే పెట్టుకొని 5 గంటలకే నిద్ర లేపటం యోగా ప్రాణాయామా ఆసనాలు ధ్యానం చేయించటం..
పాటలు డ్యాన్సులు..చేయించటం మంచి విలువలని బోధించటం..తల్లి దండ్రుల విలువని రక్త సంబంధాల ప్రాముఖ్యతనీ వివరించటం.. చేసారట..
ఇంకా.. ఏకాగ్రతని పెంచుకోవటం ఎలా..
గమ్యాన్ని ఏర్పరచుకోవటమెలా..
మనం ఇలాంటివి పిల్లలకు బోధించలేం..
ఒకవేళ చెప్పినా ..వినరు..
ముందు మనమలా లేము కదా..
చివరి రోజు పిల్లలతో తల్లి దండ్రులకు పాద పూజ చేయించారు..
పూజకు కావల్సిన సరంజామాతో ..మేము అక్కడికి చేరుకున్నాం..
పది రోజులు తల్లి దండ్రులను వదిలి వున్న పిల్లలు వారి రాకకై కళ్ళలో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో..
వాళ్ళను చూడగానే పరుగు పరుగున వచ్చి ..కళ్ళలో నీళ్ళు కారిపోతుండగా..వాటేసుకోవటం..నాకైతే ఆ తల్లీ పిల్లలను చూసి హృదయం ద్రవించిపోయింది..
మైకులో వేదాలు వినబడుతున్నాయి..
ఇక..పాద పూజ ఆ పిల్లలు తమ చిట్టి చిట్టి చేతులతో ..తల్లి దండ్రులకు మైకులో వినబడుతున్న సూచనల ప్రకారం తల్లి దండ్రుల పాదాలను పూలతో పూజించారు..
ఒక పక్క తల్లి దండ్రులు ఇదే కదా మన సంస్కృతి అని ..కండ్లు చెమర్చు కుంటున్నారు..
తల్లి దండ్రులకు పూల మాలలు వేసారు.. పాద తీర్థాన్ని పిల్లలు తమ తలలపై చల్లు కున్నారు..
ఆ తరువాత పిల్లలు ఆ క్యాంప్ పై తమ అభిప్రాయాలను తాము పొందిన అనుభూతులను.. తాము నేర్చుకున్న విషయాలను అందరూ ఆశ్చర్య పోయే విధంగా వివరించారు..
చక్కటి భోజనాలు.. వానిలో కొన్ని పచ్చి కూరగాయలు..జ్యూసులు..మంచి అలవాట్లు..
మంచి బోధనలు .. వీనిని మనం మన పిల్లలకు అందివ్వ గలమా..?
అందుకే..ఏ క్యాంప్ నాకు బాగా నచ్చింది..
మీకెలా వుందో చెప్తారుకదూ..!!!
1 comment:
Yoga with human relations lessons...!!!, So Good...,
Post a Comment