Saturday, May 14, 2011

మా ఇల్లు బృందావనం..






సెలవులంటే గుర్తోచ్చింది..
నా చిన్న తనంలో సెలవులిస్తే..మా ముగ్గురక్కలూ..బావలూ..వాళ్ళ పిల్లలూ..
అబ్బ..ఎంత బావుండేదో..
మా ముగ్గురక్కలకూ ముగ్గురేసి పిల్లలు..నేను ఒకతి మెత్తం పది మందిమి..
ఏం ఆటలు..ఏం ఆటలు..
పది మందిని కూచోపెట్టి మా అక్కలెవరో ఒకరు అన్నం కలిపి ముద్దలు పెట్టే వాళ్ళు..
ఎంత అన్నమైనా హాం..ఫట్..
అందరూ కలిపి ఇంట్లొనే దాగుడు మూతలు..అవీ..ఇవీ.. మా అక్కల ముచ్చట్లకు.. అంతూ పొంతూ..ఉండేది కాదు..
అందరూ కలిసి అడవి రాముడు సినిమాకు వెళ్ళాం..ఓసారి..
మా అక్క కొడుకు యర్ టి రామారావ్ స్టెప్స్ బాగా వేసేవాడు..

మా అన్నయ్య రాట్రి ఇంటి బయట మంచమేసుకుని పడుకునే వాడు..ఇంటికి కాపలా అని పైకి..కానీ లోపల సెకండ్ షోకి వెళ్ళి వచ్చినా ..గుట్టు చప్పుడు కాదు కదా.. అది లోపల మీనింగ్..
వాడు అలా బయట పడుకొని ..నిద్ర వచ్చే వరకూ..యన్.టి.ఆర్ పౌరాణిక సినిమాలలోని పద్యాలు గాట్టిగా పాడుతూ..ఉండేవాడు..
బావా.. యేమంటివి..యేమంటివి.. అంటూ..


మా అయ్య అప్పట్లో వందకో రెండు వందలకో చిల్లర తెచ్చే వారు..
పిల్లలందరినీ.. చుట్టూ కూచోపెట్తుకుని  డబ్బులాట ఆడేవారు..
అంటే చిల్లర వడినిండా.. పోసుకుని..గుప్పిటిలో యెత వస్తే అంత మా ముందుకు చాచే వారు.. అందులో యెంత డబ్బు వుందో చెప్పాలి..
అందరూ పోటీలు పడి ఒకరి మీద ఒకరు పడి చెప్పేవారం..
ఒకటే నవ్వులు..కేరింతలు..
ఎవరు కరెక్టుగా చెప్పితే వారందరికీ పంచేవారు..


మా అక్కలు మా నాన్నగారి పాటలు పాడేవారు..
మా ఇల్లు అందమైన బృందావనంలా వుండేది..
మా అమ్మ అక్కలకు బావలకు పిల్లలకు బట్టలు పెట్టేది..నాకీ రంగు కావలంటే..నాకీ రంగు కావాలని .. కోపాలు .. అలకలు..
నువ్వు టెంత్ మంచి మార్కులతో పాసవ్వాలి అప్పుడు నీకు నేను వాచీ కొనిస్తాను అంటూ మనవళ్ళను ఉత్సాహ పరిచేది మా అమ్మ..
మా అన్నయ్య కొత్త సినిమా పాటలు కేసెట్లు తెస్తే విన్నన్ని రోజులూ విని మెల్లిగా ఊరికి పోయేటప్పుడు వాళ్ళ బ్యాగులలో దాచేసుకు పోయేవాళ్ళు మా రెండవ అక్కయ్య పిల్లలు..
మొదట కోపం వచ్చినా పోనీలే .. పాపం పిల్లలు అని లైట్ తీసుకునే వాళ్ళు మా నాగక్కయ్య అరవిందు అన్నయ్య..
మా నాగక్కయ్యతో కుస్తీ పోటీకి దిగే వాడు మా రెండవ అక్క కొడుకు కాంతు..వాడు అప్పట్లో బాల భీముడు..
మా పెద్ద బావ సాహితీ బంధువు..చూసిన ప్రతిదానిపైనా కవిత్వం చెప్పే వాడు
సెలవులలో హయగ్రీవ స్తోత్రం,హనుమాన్ చాలీసా...అన్నీ ఇంకా ఎన్నో నేర్చుకొనే వాళ్ళం..
కమలా కుచ చూచుక కుంకుమతో నియతా..రుణితా.. తులనీ లతనో..
నేనైతే సినిమాలలో యన్ టీ ఆర్ రాజనాల పుష్పక విమానంలో పోరాడుకుంటుంటే..
టెన్షన్ తట్టుకోలేక కమలాకుచ చూచుక కుంకుమతో..అని గబ గబా..చెప్పేదాన్ని..యన్ టీ ఆర్ ను గెలిపించమని..
ఏమిటో ఆ రోజులు..
ఎక్కడికి వెళ్ళయో..
కానీ మనసులలోంచీ..పోవెందుకని..




పుట్టపర్తి అనూరాధ అక్షర కలశం: లేఖిని నాది మాటలు మనసువి

పుట్టపర్తి అనూరాధ అక్షర కలశం: లేఖిని నాది మాటలు మనసువి: లేఖిని నాది మాటలు మనసువి...: "లేఖిని నాది మాటలు మనసువి: లేఖిని నాది మాటలు మనసువి: ఇలాంటిదే ఇంకో ఇస్టోరీ.... : 'లేఖిని నాది మాటలు మనసువి: ఇలాంటిదే ఇంకో ఇస్టోరీ.. పాపం....."