Saturday, May 7, 2011
లేఖిని నాది మాటలు మనసువి: లేఖిని నాది మాటలు మనసువి: లేఖిని నాది మాటలు మనసువి...
లేఖిని నాది మాటలు మనసువి: లేఖిని నాది మాటలు మనసువి: లేఖిని నాది మాటలు మనసువి...: "లేఖిని నాది మాటలు మనసువి: లేఖిని నాది మాటలు మనసువి: నా బ్లాగులో స్లయిడ్ ... : 'లేఖిని నాది మాటలు మనసువి: నా బ్లాగులో స్లయిడ్ షో మార్చ..."
సరస్వతీ నమస్తూభ్యమ్... మదర్స్ డే సందర్భంగా..
నలువ వలపులరాణి..
కలికి నెమలిని ఆని..
అలవోక రాగాల వల్లకిని సవరించ..
పలుకు తేనెలపాట..పెదవి నవ్వుల జార..
ఆనంద సంద్రాల జగములూయలలూగె
లలిత కళలకు తనువు ఉల్లలితమైపోయె..

నమస్తే..నమస్తే..అక్షర స్వరూపిణీ..
నమస్తే..నమస్తే..లీలా విలాసినీ..
నమస్తే..నమస్తే..బ్రహ్మాండ నాయకీ..
నమస్తే..నమస్తే..సురలోక పూజితా..

మునుల వందనమంది..పరమపదమిచ్చేవు..
నాల్గు వేదాలలో ..సకల శాస్త్రాలలో..
కావ్యాలు..గేయాలు..కృతులు..కీర్తనలలో..
విశ్వ రూపము నిలిపి ..పిలచి నంతనే పలికి..
చదువులకు తల్లిగా ..వందనము లందేవు..

సంగీత సాహిత్య నాట్యాలు ఒకవైపు..
చిత్రలేఖన శిల్ప కళలన్ని ఒకవైపు..
దేవదేవిని చేరి కీర్తించబూనాయి..
ముందుగా సంగీతమే పలుకు విప్పింది..
తన చరిత రీతులకు అశ్రువులు కలిపింది..

చిరుగాలినై..చెట్టు..పుట్టలను తిరిగాను..
సుడిగాలినై..కొండ కోనలకు ఎగసాను..
సెలయేటి అలలలో పిల్లగాలికి మల్లె..
పిచ్చి తిరుగుళ్ళలో ..సుడులు సుడులయ్యాను..
పిచ్చి తిరుగుళ్ళలో ..సుడులు సుడులయ్యాను..
ఏనాటి పుణ్యమో..నీ కరుణ కిరణమై..
కరడు గట్టిన పాప తిమిరాన్ని తరిమింది..
జడమైన నా ఉనికి అమృతమయమయ్యింది..
సరిగమలో నేను పరవళ్ళు తొక్కాను..
గమకాలలో గాన గాంధర్వమైనాను..
ఎందరో గాయకులు సంగీత ఝరులలో..
ధన్యులై తడిసారు..అమరులై నిలిచారు..
రామ చంద్రుని కొలిచె కీర్తనల త్యాగయ్య..
కృష్ణయ్య కట్టుబడె మీర ప్రేమకు ప్రభుగ..
కడలేని సంగీత వాసంత విభవాన..
పరవశించితి నేను..అణువణువు అణువణువు..
నా గురివి నేవె కద..
నా గమ్యమే నీవు..
గమనమే నీవమ్మ..
సద్గురువు నీవేను..
అరమోడ్పు కనులతో..
ఆర్ద్ర హృదయమ్ముతో..
గళమిప్పె శిల్ప కళ..
కలల వాకిలి తెరువ..

ఎండలకు ..వానలకు..
తుంటరి ..తుఫానులకు..
బండనై ..మొండిగా..
బ్రతుకు ..సాగించాను..
నిర్జీవ నీరధిన ..
నిర్ణిద్ర శక్తిలా..
నిస్తేజమై..
నిండు నిప్పులను నమిలాను..

తరువునుంచీ..విత్తు..
ఆర్త హృదయానికే..
కదలు దైవత్వమ్ము..
నాటి నుంచీ .. నన్ను ఉలి పలకరించింది..
నిలువు.. నిలువున ..నన్ను కదిలించి మురిసింది..

జడమైన నా మేను జల జలా..పొంగేను..
శిల్పి ఆవేశానికభినేత్రి నయ్యాను..
శారదే..నీ కరుణ..
వర్ణించ ..నా తరమ..
వదలలేనమ్మ..
నీ పద యుగళి నీ జన్మ..
అంతలో సాహిత్య రాణి వాణిని విప్పె..
గుండె లోతుల ప్రేమ వడి వడిగ ప్రవహించె..

నీవే చదువుల తల్లివి..
వీణా పుస్తక ధారిణి..
వాగ్దేవివి వర ముద్రతొ..
ఐం..బీజా మయివైతివి..
ఉపాసించె కాళిదాసు..ఐం..బీజము నాదిలో..
సిధ్ధిత్వము నొంది నిలిచె మహాకవిగ ఇలలో..
శుక శౌనకాదులూ..వ్యాస వాల్మీకులూ..
నన్నయ్య..తిక్కన్న..ఎర్రన్న..పోతన్న..
సాహితీ మధనాన్ని..తనివారగా చేసి..
కావ్య హారతి నీకు నిండుగా పట్టారు..
నిను బొగడ నేనెంత..
నీవె కళలకు పుంత..
కావవే ..వేద మయి..
కావవే ..భక్త నిధి..
తకిట..తక..తకిట..తక..
ధిమి.. ధిమి.. ధ్ధిమిధ్వనుల
దివిని సందడిరేప..

అందెలతొ చిందులిడ..
చిరు మందహాసమ్ము..
శర్వాణి చిలికించె..
నాట్య సఖి హృదయమ్ము..
పురివిప్పె పింఛమై..
పెదవి దాటనె లేదు ..పలుక దలచిన మాట..
ఎదురాయె దైవమే..గురువయ్యి..తెరువయ్యి..
జీవమే చరణాల దక్షిణగ అర్పింతు..
నాట్యాభిషేకాన..అంజలిని ఘటియింతు..
(అందరూ కలిసి..)
అవధరించుము.. దేవి..శర్వాణి..గీర్వాణి..
భగవతీ..భారతీ..సర్వార్థ సంధాత్రి..
అభిలషార్థమునిమ్ము..ఆత్మ స్థైర్యమునిమ్ము..
నిన్ను సన్నుతి చేయ నిండు హృదయమ్మిమ్ము..
విశ్వ శాంతికి కళలు కదలు కార్మికులుగా..
నిస్వార్థముగ నడచు దివ్య సంస్కృతినిమ్ము..
Subscribe to:
Posts (Atom)