నేను మదర్ వృధ్ధాశ్ర మం లో అడుగుపెట్టాను..
అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ కోసం వచ్చాను నేను..
నర్సొకావిడ సోఫాలో కూచోమని చెప్పింది..
పది నిమిషాలతరువాత లోపలినుంచీ పిలుపు..
మీరింతకు ముందెక్కడ పనిచేసారు..
నేను నా పూర్వ అనుభవాన్ని చెప్పాను..పర్వాలేదన్నట్లుగా మొదటతన్ని చూసాడు ప్రవీణ్..
సరే.. సోమవారమ్నుంచీ వచ్చి చేరండి..అనేసి వెళ్ళిపోయారిద్దరూ బయటికి..
ఇంకొకతనిపేరు ప్రకాషట..అతనే దీనికి ఓనర్..
ఒక్కసారి లోపలికి వెళ్ళి చూస్తాను..అన్నా..
వెళ్ళండి..తప్పకుండా చూడండి..
లోపల ఒక్కొక్కరూ ఒక్కో విధంగా వున్నారు..
నడవగలిగిన వాళ్ళూ ..నడవలేని వాళ్ళూ..మతే లేని వాళ్ళూ బెడ్డుకే పరిమితమైన వాళ్ళూ..

వాళ్ళపై తెలియని ప్రేమ పొంగింది..
ఒకరిద్దరిని పలకరించాను..
నల్లగా మాసి కంపు కొడుతున్న బెడ్ షీట్లూ ..కంపు గొడుతున్న వాతావరణం..
ఇంతలో ఒకామె బ్యాగులన్నీ సర్దుకొని ముందుగదిలో ఎవరికోసమో ఎదురుచూస్తూంది..
మా అబ్బాయొస్తాడు..వెళ్ళాలి అంది..
అవునా అన్నట్లు చూసాను..
మళ్ళీ ఆమే అంది..నా కూతురు సుశీల అత్తగారు రాక్షసి..నెల్లాళ్ళ పిలనుపెట్టుకొని ఎలా చేసుకుంటుందీ..?నేను వెళ్ళాలి సాయానికి..
ఎక్కడ మీ ఇల్లు..?
చిలకలగూడో..కూకట్ పల్లో..అంది..
అదేంటి..అన్నట్లు చూసా..ఒక నర్సు ఆమె మెంటల్ అన్నట్లు చేయి తిప్పింది..
నాకు వడలు ఇష్టం తెచ్చావా..అంది ఆమె మళ్ళీ..
లేదన్నాను..ఎందుకు తెస్తావ్ ..? అమ్మ కాబట్టింటే కదా..అంది
ఇంతలో ఒకతను బయటనుంచీ వచ్చాడు..
ఏమ్మా ..మళ్ళీ సర్దావా..? అన్నాడామెను..
అవునుమరి వెళ్ళాలి ..సుశీలకు కష్టం కాదూ..
ఇదే వరస సారూ..ఈమె..మొన్నయితే రోడ్డునపడి
వెళ్ళిపోయింది..ఆయాలను వెంట తరిమాను..అయిన వాళ్ళకు అందకుండా వురుకుతానే వుంది..బస్సెక్కడానికి..
అబ్బ ఎంత బలమో..
ఆయాలు.. అయ్యా.. అయ్యా.. ఆమెను పట్టుకోండి అని కేకలు వేస్తే..ఎవరో పట్టుకుని ఆపారు..
తలప్రాణం తోకకొచ్చింది..ఆరోజు..
నీకు తోకుందా.. కోపంగా అడిగిందావిడ..
వెనుకనుంచీ ఇంకొక నర్సు ఆమె తలమీద మొట్టింది..
అబ్బా.. అబ్బోయ్..ఆవిడ అరిచింది బాధగా..
ఇంకోసారి రోడ్డుమీద కెళ్ళావంటే కాళ్ళూ చేతులూ కట్టేస్తాను.. అందా నర్సు..
వెనుకనున్న ఆ నర్సుముసలావిడ చేయి పట్టుకుని వెనక్కు తిప్పింది..
ఏమన్నావే ..? అంటూ..
నన్ను చంపేస్తావా..? ఇలా అయితే నేను సుశీలతో ఎలా వెళ్ళేది..?
ఒక్క పెట్టున ఏడవసాగిందామె..
ఊరుకోమ్మా..అన్నాడు నల్లటతను ఆయనపేరు రత్నయ్యట..అక్కడ బయట పనులు చూసేది అతనేనట..
దీనికిలాగే చేయాలి సార్.. లేకపోతే లొంగదు..
మీరు.. అన్నాడు రత్నయ్య నన్ను చూసి..
నేను కంప్యూటర్ జాబ్ కోసం వచ్చాను సోమవారం నుంచీ రమ్మన్నారు..అన్నా..
ఆహా.. నేను బయట పనులు చూస్తానమ్మా.. అంటున్నాడు..
ఓ నల్లాయనా .. నా కోసం వడలు తెచ్చావా..? ఏడుస్తూనే అడిగిందావిడ..
ఈ రోజు తేలేదు రేపు తెస్తాలే..అన్నాడు రత్నయ్య..
రేపా రేపు నేనుండను.. నా కొడుకొస్తాడు.. పోతున్నా..
వస్తాడు.. వస్తాడు.. నీకోసం యముడే వచ్చేది..
అందరూ నవ్వారు..
ఇంతలో లోపలినుంచీ ఒక ఆయమ్మ వచ్చింది..
ఓ మూల కూచుని నడుంకు కట్టుకున్న బ్యాగ్ లోంచీ ఆకు వక్కా సున్నం తీసి కలిపి నోట్లో వేసుకుని నమలసాగింది..
ఏం రాములమ్మా..ఇంకా చుక్కేయలేదా..రత్నయ్య ఆమెని పలకరించాడు..
ఆ రోజూ వేస్తానా..అయినా డబ్బుండొద్దూ..?
నీకు డబ్బుకేం కొదువ డబుల్ డ్యూటీలు చేస్తున్నావ్..కదా..
అవ్.. అన్నీ నా కొడుకు చేసిన అప్పు ఇడిపించడానికే పాయ..
ఏయ్ .. రామీ.. రాత్రి తాగి వచ్చి పండుకొంటే అది డ్యూటీనా..
ఆ రూములో గుండుది.. పడకపైనే ఉచ్చ పోసింది..
పొద్దున్నే స్నానికి లేపితే అంతా కంపు కంపు..నాక్కోపమొచ్చి ఒక్కటి పీకా..
దానికి ఉచ్చొస్తే పోయిచ్చలేవా..?
అవ్.. అర్ధ రాత్రి లేచి ఎవడు పోయిస్తాడు..అయినా దాన్ని ఇరవై రూపాయలీ పోయిస్తా అన్నా..లేవనింది..బాడకోవ్.. నేనెందుకు పోయిచ్చాలే..
అనింది రాములమ్మ నిర్లక్ష్యంగా..
నా కళ్ళు తిరుగుతున్నాయి..
ఇంతలో రూములోంచీ కేకలు వినబడ్డాయి..
ఏయ్..కూర ఒక పక్కగా వేయమన్నా వేయలేవూ..?
ఆ.. ఏస్తా..ఏస్తా..
మళ్ళీ అదే పని .. ఓళ్ళు కొవ్వెక్కిందా..?చెప్తే అర్థం కాదా..?
ఆ ఆయా విసా విసా బయటికి వచ్చింది..
ఆ నాలుగో నంబర్ తో నేను పడలేను..ఎక్కువ చేస్తూంది..
దొంగలం..
సర్లే తీ.. అన్నాడు రత్నయ్య..నేనున్నానన్నట్లు సైగ చేస్తూ..
అయినా ఆమె ఏం భయపడే ధోరణిలో లేదు..
అదికాదు..సారూ ..రోజూ తిండి దగ్గరే..గొడవ పెట్టుకొంటుంది..
అవ్..ఆళ్ళ బిడ్డలు దుబాయ్ లో ఉన్నారయ్యే..
వుంటే దీన్ని ఈడ ఎందుకేసిన్రంట..
ఓ పూట తిండి పెట్టకుర్రి ..రోగం కుదురుద్ది..ముసల్దానికి..
ఇంకో ఆయా నాగ్గాని కాలిందంటే నాలుగిస్తా..దెబ్బకు దయ్యం దిగిపోవాల..
మేం..టి వి వాళ్ళం ..
వుండండి.. మా సార్ కు ఫోన్ చేసి చెప్తా.. అందో నర్సు..
పక్కగా వెళ్ళి మాట్లాడింది..
నేను రాలేను..వాళ్ళకు జాగ్రత్తగా చూపించండి..గొడవలు రావద్దు..ముసలోళ్ళని నీటుగా పెట్టండి..
అన్నట్లు ఆర్డర్లు అందాయి..
వాళ్ళను సోఫాలలో కూచోమన్నారు..
క్షణాల్లో పరిస్థితులు మారిపోయాయి..
ప్రతి బెడ్డుకూ మల్లెపూవు ల్లాంటి బెడ్షీట్లు..దర్శనమిచ్చాయి..అక్కడక్కడా..సెలైన్లు ముసలి వాళ్ళకు ఎక్కిస్తున్నారు..
తెల్లని కోటు..మెడలో స్టెతస్కోపూ..ఓ డాక్టరు మొహాన చిరునవ్వుతో ప్రత్యక్షయమయింది..
వాళ్ళను రిసీవ్ చేసుకుంది..
అయాం సుకన్య.. డాక్టర్ ని ..రండి.. రండి..లోపల కెళ్దాం..
వాళ్ళతో నేనూ నడిచాను..
ఇందాకా గొడవ పెట్టిన నాలుగో నంబర్ ముసలావిడ ముసుగేసుకొని పడుకుంది..
ఒకామె అరటి పండు తింటోంది..
ఇంకొకామె కాస్త మంచి చీరతో ఒద్దికగా కనిపిస్తే ..మరొకామె బెడ్ పై కూచుని వీళ్ళని చూస్తూంది..
మాతృ దేవో భవ .. పితృ దేవో భవా.. అన్నారు..కానీ ఈ వేగవంతమైన నగర జీవితంలో ముసలి వాళ్ళ నిర్వహణ కష్టమైపోయింది.. నేటి పరిస్థితుల్లో ఇద్దరూ ఉద్యోగం చేస్తే గానీ గడవదు..
తలిదండ్రులను తమ ఒడిలో పెట్టుకొని చూసుకుంటున్న సంస్థలలో ఈ మదర్ ముందుంది..
ఇక్కడున్న తల్లులందరూ మదర్ ఒడిలో సేద తీరుతున్న వారే..
మీరు చెప్పండమ్మా..ఇక్కడెలా వుందీ..
చాలా బాగుంది..
భోజనమూ .. టిఫెనూ..అన్నీ చక్కగా అందుతున్నాయా..?
అవును మమ్మల్ని తమ సొంత తల్లిదండ్రుల్లా ఇక్కడి ఆయాలూ నర్సులూ .. చూసుకుంటారు..
ఒంట్లో బాగా లేకపోతే మా డాక్టరమ్మ మందులిస్తుంది..
ఇంక మాకేం కొదవ..? హ్యాపీగా వున్నాం..
అందొకావిడ..
ఇంకొకామెను ప్రశ్నించారు..టి వి వాళ్ళు..
అమ్మా మీకెంత మంది పిల్లలు..?
ముగ్గురు.. అందర్నీ కష్ట పడి చదివిస్తి..అందరూ మంచి కొలువుల్లో చేరుకున్నరు.. నన్నిందుల తోసిన్రు..
వల వల ఏడవటం మొదలు పెట్టింది..ఆమె..
ఇంతలో చేయి తిప్పిన ఆ నర్సు ఆమె పక్కన కూచుని ప్రేమగా లాలించింది..
మేమున్నాం కదా..మేం నిన్ను సరిగా చూస్త లేమా.. ఏంది.. చెప్పూ.. అంది..
అవ్.. ఒకళ్ళు కాదు.. గింతమంది.. ఉన్నారిక్కడ.. నన్ను జూడనీకి..
మళ్ళీ ఏడ్వటం మొదలు పెట్టింది..
కెమెరామెన్ .. యాంకర్ కళ్ళ నీళ్ళు తుడుచుకున్నారు..
కెమెరా ముందుకు కదిలింది..
అతనికి కాళ్ళు .. చేతులూ పడి పోయినై మాటరాదు..అతనికి సెలైన్ ఎక్కిస్తున్నారు..
అతన్ని సానుభూతితో చూసింది కెమెరా
అందరికీ బ్రెడ్డూ.. బిస్కెట్ లు పంచారు..
ఓ వ్యాపార వేత్త అందరికీ బ్లాంకెట్లు పంచాడు..
ఓ గంటసేపు హడావుడి చేసి కెమెరా టీం వెళ్ళిపోయింది..
పరిస్థితి సాధారణమైంది..కాసేపటికి..
మళ్ళీ ప్రకాష్ ఫోను..
నర్సు జరిగిన సంగతి వివరించింది..
మళ్ళీ ఏవేవో ఆదేశాలు..
వెంటనే నర్సులూ ఆయాలూ కదిలారు..
ముసలాళ్ళకిచ్చిన బ్లాంకెట్లు తీసేసుకున్నారు..
మాకిచ్చారు.. మేమివ్వం అన్న వాళ్ళనుంచీ లాక్కున్నారు..
మిగిలిన బ్రెడ్డూ బిస్కెట్లూ.. తలా ఇన్ని పంచుకున్నారు..
అక్కా నేనీ గ్రీన్ దుప్పటి తీసుకుంటా..
తీస్కో..
ఎర్రది నాకివ్వక్కా..
సరే..
మరి నాకూ..?
నీవా నల్లది తీస్కో..
మిగిలినవి స్టోర్రూం లో పెట్టండి..రేపు సారుకు చూపించాలి..
సరే..

ఏం చేస్తారు సార్ ఇవన్నీ నేను రత్నయ్యని అడిగాను..
ఏం చేస్తాం మేడం .. షాపులో అమ్మేస్తాం.. ఎంతొస్తే అంతకి..
అవునా..?
అవ్.. మళ్ళీ సారుతో అనద్దు మేడం నన్ను ఒక్కటి గుంజుతడు.. అన్నాడు
రత్నయ్య..
చెప్పను లేంది సార్ అన్నా..
అయినా ముసలాళ్ళకిచ్చినవి..
అంతే కాదు మేడం .. ఒక్కోక్కళ్ళు కూలర్లిస్తరు..మంచాలిస్తరు..అన్నీ అమ్ముడే..
తేలికగా అన్నాడు అతను..
నా కక్కడ ఇక ఉండబుధ్ధి కాలేదు..
నేరుగా ఓ టిఫెను సెంటరులో వడలు ప్యాక్ చేయించి..తిరిగి హోం కొచ్చాను..
వడలు.. వడలని .. కలవరించిన ఆమె చేతిలో ఆ పొట్లం పెట్టా ఆమె ఆశగా పొట్లం లాక్కుని లోపలికి పరుగు తీసింది..
నేను భారమైన మనసుతో బయట పడ్డా..
కెమెరామెన్ .. యాంకర్ కళ్ళ నీళ్ళు తుడుచుకున్నారు..
కెమెరా ముందుకు కదిలింది..
అతనికి కాళ్ళు .. చేతులూ పడి పోయినై మాటరాదు..అతనికి సెలైన్ ఎక్కిస్తున్నారు..
అతన్ని సానుభూతితో చూసింది కెమెరా
అందరికీ బ్రెడ్డూ.. బిస్కెట్ లు పంచారు..
ఓ వ్యాపార వేత్త అందరికీ బ్లాంకెట్లు పంచాడు..
ఓ గంటసేపు హడావుడి చేసి కెమెరా టీం వెళ్ళిపోయింది..
పరిస్థితి సాధారణమైంది..కాసేపటికి..
మళ్ళీ ప్రకాష్ ఫోను..
నర్సు జరిగిన సంగతి వివరించింది..
మళ్ళీ ఏవేవో ఆదేశాలు..
వెంటనే నర్సులూ ఆయాలూ కదిలారు..
ముసలాళ్ళకిచ్చిన బ్లాంకెట్లు తీసేసుకున్నారు..
మాకిచ్చారు.. మేమివ్వం అన్న వాళ్ళనుంచీ లాక్కున్నారు..
మిగిలిన బ్రెడ్డూ బిస్కెట్లూ.. తలా ఇన్ని పంచుకున్నారు..
అక్కా నేనీ గ్రీన్ దుప్పటి తీసుకుంటా..
తీస్కో..
ఎర్రది నాకివ్వక్కా..
సరే..
మరి నాకూ..?
నీవా నల్లది తీస్కో..
మిగిలినవి స్టోర్రూం లో పెట్టండి..రేపు సారుకు చూపించాలి..
సరే..

ఏం చేస్తారు సార్ ఇవన్నీ నేను రత్నయ్యని అడిగాను..
ఏం చేస్తాం మేడం .. షాపులో అమ్మేస్తాం.. ఎంతొస్తే అంతకి..
అవునా..?
అవ్.. మళ్ళీ సారుతో అనద్దు మేడం నన్ను ఒక్కటి గుంజుతడు.. అన్నాడు
రత్నయ్య..
చెప్పను లేంది సార్ అన్నా..
అయినా ముసలాళ్ళకిచ్చినవి..
అంతే కాదు మేడం .. ఒక్కోక్కళ్ళు కూలర్లిస్తరు..మంచాలిస్తరు..అన్నీ అమ్ముడే..
తేలికగా అన్నాడు అతను..
నా కక్కడ ఇక ఉండబుధ్ధి కాలేదు..
నేరుగా ఓ టిఫెను సెంటరులో వడలు ప్యాక్ చేయించి..తిరిగి హోం కొచ్చాను..
వడలు.. వడలని .. కలవరించిన ఆమె చేతిలో ఆ పొట్లం పెట్టా ఆమె ఆశగా పొట్లం లాక్కుని లోపలికి పరుగు తీసింది..
నేను భారమైన మనసుతో బయట పడ్డా..