Monday, May 23, 2011



అక్కయ్య ఇంటికి వెళ్ళాం..
పల్లెటూరు..అక్కయ్య..ఆమె కొడుకు శ్రీకాంత్..
అక్కయ్యకు డెభ్భయ్ ఏళ్ళు..అయినా తన పని ఇంటి పని చక్కగా చేసుకోవటమే కాక..మమ్మల్నీ చక్కగా ఆదరించింది..
పచ్చటి పొలాలు..పల్లె వాతావరణం..
పిల్లి.. దానికి అప్పుడే పుట్టిన పిల్లలూ..ఎంత బావుందో..చిన్న చిన్న పిల్లలు తల్లి చుట్టూ మ్యావ్ మ్యావ్..మంటూ తిరగడం..పరక పుల్లను కదిలిస్తే అవి ఆపుల్లనే చూస్తూ..దాన్ని పట్టుకోవడానికి గెంతటం..
మా పాప బాగా ఎంజాయ్ చేసింది..సిటీలో పిల్లులు వున్నాయా..?
దూడ ఒకటి తలుపు తీసి వుంటే లోపలికి దూసుకొచ్చింది..
మా శ్రీకాంతు దాన్ని ప్రేమగా బయటికి మళ్ళీ తేసుకుపోయి ఒక గోలేంలో ఇన్ని బియ్యం బెల్లం వేసి తెచ్చి దానికి పెట్టి అది తినే వరకూ..దాని మెడకింద నిమురుతూ దాన్ని ముద్దు చేస్తూనే వున్నాడు..
కాస్త సాయింత్రమయ్యేసరికి కోతులగోల..
గుంపులు గుంపులుగా కోతులు కడుపుకి కర్చుకున్న వాని పిల్లలూ..
కిటికీల్లొంచీ..లోపలికి చూస్తూ..కిచ కిచ లాడటం..అక్కయ్య వేళ్ళాడుతున్న అరటిగెలనుంచీ నాలుగు అరటి పళ్ళు..వాటికి అందించటం అవి తింటూంటే..చూసి ఆనందించడం..
పిల్లలూ చిన్న చిన్న బెల్లం ముక్కలు వాటికి అందించి అవి తింటూంటే కేరింతలు కొట్టారు..
పనస పండ్లూ..మామిడి పండ్లూ..కడుపు నిండా..తిని ఆనందించాం..
సిటీలో కిలోల లెక్క..అక్కడ లేదుగా..
తుంగభద్రా డ్యాంకు వెళ్ళాం అక్కడ నీళ్ళు లేవు గానీ ..వున్న కాస్త నీళ్ళూ..మమ్మల్ని అలరించాయి..
మళ్ళీ ఆగస్టులో మమ్మల్ని రమ్మని అప్పటికి డ్యాం నిండుతుందని అక్కయ్య పిలిచింది..
డెబ్బయ్ వయసులో కనబడుతున్న ఆ ప్రేమకు..ఆప్యాయతకూ నా సిటీ జీవితపు కళ్ళు చెమర్చాయి..
అందమైన జ్ఞాపకంగా అక్కయ్య ఊరు మా పాపకు చూపించాను..



2 comments:

ANALYSIS//అనాలిసిస్ said...

పొటేములు (ఫోటోలు) భలే ఉన్నాయండి... ఇంతకూ ఏ ఊరు మీరెళ్ళింది ... ఊరు చాలా బాగుంది

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఫోటోలు బాగున్నాయి. మీ అక్కయ్య గారి ఊరు బాగుంది. మీ అక్కయ్య గారి ఇంట మీ కబుర్లు బాగున్నాయి. రెండవ ఫోటో చూసిన తరువాత "తెలి మంచు కురిసింది పాట పాడనా ప్రభూ" అన్న పాట గుర్తుకొచ్చింది.