సరళీ వరుసలతోనే ..తొలి అడుగుల గమనం..
మాయామాళవ గౌళం అందించును హస్తం..
గీతాలు..అలంకారాలు..వర్ణాలూ ..జతులూ..
మైలురాళ్ళు..గీటురాళ్ళు..నీటిసుళ్ళు..తేనె గుళ్ళు..
అవిశ్రాంత పరిశ్రమకు ఇవే బలమైన వేళ్ళు..
మూర్ఛనలు పోవు ప్రజ్ఞకు మూలాలివి..అమూల్యాలివి..
స్వర ఉచ్చారణ..
రాగ సంచార .. రమ్య వర్తనం..
హర్ష వర్షితం..రసిక వందితం .. వర్ణం..
పల్లవీ.. అనుపల్లవీ..సహిత..
ముక్తాయీస్వర లలిత లాలనం..
అలతి అలతి పద లవలీ లాశ్యం
సభిక శ్లాఘితం..శ్రవణ రంజనం.. వర్ణం..
షడ్జమ రిషభ..
గాంధార మధ్యమ..
పంచమ ధైవత నిషధ..
సరిగమ పదనీ స్వర ఔధ్ధత్యం..
మొక్ష మార్గితం..మహిమా పూతం.. వర్ణం..
కృతివినీవు..
కల్పనా కృతివి నీవు..
సంగీతాద్భుత గతివినీవు..
అద్వితీయ వేద 'రుచల' పుష్కరిణి నీవు..
కీర్తనా..యోగశక్తి ఆవిర్భావాకృతివి నీవు..
ఏకరాగ..సంచార నందనా..
బహు రాగామృత గాత్ర శోభితా..
రాగమాలికా నామాలంకృతా..
కీర్తనా..ధ్వనిత నర్తనా..
మూర్తీత్రయ కీర్తనమే..
త్రిమూర్తి పద అర్చనమై..
భావ రాగ తాళ గతులె..
ఫల పుష్పాదుల వలెనై..
జోడింతుము జీవాత్మలు..
కర వినమ్ర వందనమై..
ఇది నారద తుంబుర గానం..
ఇది మూర్తీ త్రయ తులనం..
పరితోషణం..పరిశీలనం..
ఇది పరిణత ప్రజ్ఞకు కట్టెడి పట్టం..
4 comments:
అనూరాధ గారూ,
పొద్దు లో మీరు పుట్టపర్తి నారాయణాచార్యుల వారి గురించి వ్రాసిన వ్యాసం కంటతడి పెట్టించింది.
అలాంటి దంపతుల గురించి చదవటమే కానీ నిజజీవితం లో ఉన్నారని వారు మీ తల్లిదండ్రులని వ్రాసి మాకెంతో సంతోషం కలిగించారు. వారి కడుపున పుట్టిన మీరు పుణ్యవంతులు.
మీరు రాసిన దానికి సంబంధం లేకుండా వ్యాఖ్య వ్రాస్తున్నందుకు మన్నించండి.పొద్దులోనే వ్రాశాను.కానీ అది ప్రచురింపబడిందోలేదో తెలీలేదు.
థాంక్సండీ..
పుట్టపర్తి అనూరాధా గారు
మీరు మీ బ్లాగ్ లో స్వరార్చన గురించి తెలిపిన అంశంలో ఉన్న శ్రీ సరస్వతీ దేవి బొమ్మలో సరస్వతీ దేవికి బొట్టు లేదు. ఇది ధర్మంకాదు. ముఖమునకు బొట్టు ఉండడం అనేది మూడో నేత్రమునకు(మనోనేత్రమునకు) సంకేతకం. బొట్టు లేని ముఖము, సూర్యుడు/చంద్రుడు లేని ఆకాశం ఆకాశమును చూసినట్లు వుంటుది. గమనించగలరు.
క్షమించండి గమనించలేదు ..
Post a Comment