Friday, May 6, 2011



నేను సాయిని వెళ్ళిపోతున్నాను..
మానవాకృతి దాల్చి
మాధవులుగా మిమ్మల్ని మార్చాలని బయలుదేరాను..
సేవయే సాధనమని బోధించాలనుకున్నాను..
కృతకృత్యుడనయ్యానో..లేదో..
గతంలో..అధర్మం పెచ్చు పెరిగినప్పుడు..
ధర్మాన్ని ఉధ్ధరించడానికి వచ్చేవాడిని..
భక్తి పారవస్యంలో జనం 
పరవశించేవారు..
రాక్షసత్వాన్ని రూపుమాపి..
అవతార సమాప్తి చేసి వైకుంఠం చేరేవాడిని..
ప్రేమ సూత్రం నా అవతారాన్ని 
పరిమళింపజేసింది..
సేవా మార్గం నా ప్రియ భక్తుల పరమ ధర్మం అయింది..
ఋషుల యజ్ఞాల్లో రక్త మాంసాలు..
గుమ్మరించింది ఆనాటి రాక్షసత్వం..
భగవానుడినైన నన్నే..
బందీని చేసింది ఈనాటి రాక్షసత్వం..
ప్రేమనూ సేవనూ మానవత్వాన్నీ బోధించిన
ఎవ్వరినీ..బ్రతకనీయరు వీరు..
ఈనాటి రాక్షసులను అంతమొందించడానికి..
కొత్త వ్యూహంతో రావాలిక..
ఏనాటికైనా..శాంతి,సమైక్యతే ప్రపంచాన్ని రక్షించేవి..
నా..వారు..అనుకున్న వారూ..
నేను ..వారి వాడిని తలంచిన వారూ..
ఈ మంత్రాలను మరువకండి..
వుంటాను..
ప్రేమతో..
సాయి

No comments: