Tuesday, September 6, 2011
రాధకథాకథకళి: సినిమాభిమానం
రాధకథాకథకళి: సినిమాభిమానం: శైలజకు సినిమాల పిచ్చి.. అందునా కమలేష్ సినిమాలంటే ప్రాణమిచ్చేస్తుంది.. అంతటి వీరాభిమాని. శైలజ అభిమాన హీరో కమలేష్. "ఇదో చరిత్ర" సినిమా ద్వ...
Sunday, September 4, 2011
స్వరార్చన
సరళీ వరుసలతోనే ..తొలి అడుగుల గమనం..
మాయామాళవ గౌళం అందించును హస్తం..
గీతాలు..అలంకారాలు..వర్ణాలూ ..జతులూ..
మైలురాళ్ళు..గీటురాళ్ళు..నీటిసుళ్ళు..తేనె గుళ్ళు..
అవిశ్రాంత పరిశ్రమకు ఇవే బలమైన వేళ్ళు..
మూర్ఛనలు పోవు ప్రజ్ఞకు మూలాలివి..అమూల్యాలివి..
స్వర ఉచ్చారణ..
రాగ సంచార .. రమ్య వర్తనం..
హర్ష వర్షితం..రసిక వందితం .. వర్ణం..
పల్లవీ.. అనుపల్లవీ..సహిత..
ముక్తాయీస్వర లలిత లాలనం..
అలతి అలతి పద లవలీ లాశ్యం
సభిక శ్లాఘితం..శ్రవణ రంజనం.. వర్ణం..
షడ్జమ రిషభ..
గాంధార మధ్యమ..
పంచమ ధైవత నిషధ..
సరిగమ పదనీ స్వర ఔధ్ధత్యం..
మొక్ష మార్గితం..మహిమా పూతం.. వర్ణం..
కృతివినీవు..
కల్పనా కృతివి నీవు..
సంగీతాద్భుత గతివినీవు..
అద్వితీయ వేద 'రుచల' పుష్కరిణి నీవు..
కీర్తనా..యోగశక్తి ఆవిర్భావాకృతివి నీవు..
ఏకరాగ..సంచార నందనా..
బహు రాగామృత గాత్ర శోభితా..
రాగమాలికా నామాలంకృతా..
కీర్తనా..ధ్వనిత నర్తనా..
మూర్తీత్రయ కీర్తనమే..
త్రిమూర్తి పద అర్చనమై..
భావ రాగ తాళ గతులె..
ఫల పుష్పాదుల వలెనై..
జోడింతుము జీవాత్మలు..
కర వినమ్ర వందనమై..
ఇది నారద తుంబుర గానం..
ఇది మూర్తీ త్రయ తులనం..
పరితోషణం..పరిశీలనం..
ఇది పరిణత ప్రజ్ఞకు కట్టెడి పట్టం..
Wednesday, August 31, 2011
పుట్టపర్తి అనూరాధ అక్షర కలశం: వినాయకా..నిను..వినా..బ్రోచుటకు..
పుట్టపర్తి అనూరాధ అక్షర కలశం: వినాయకా..నిను..వినా..బ్రోచుటకు..: ఎన్నియల్లో..యెన్నియల్లో.. యినాకమయ్యకు ..పూజంట..గుళ్ళో.. రారే..రారే.. .ఓ..రాములమ్మా.. చూదాము రారే..ఓ ..లచ్చుమమ్మా.. పత్తిరి పూజలు లడ్...
Monday, August 29, 2011
అడవిలో..
కుందేలుకు భలే గర్వం ..
తాను ముద్దుగా అందంగా వుంటాననీ..
మెరుపులా పరిగెడతాననీ..
తెలివితేటలూ ఎక్కువనీ..
అలానే తాబేలును చూస్తే విపరీతమైన చులకన..
పిరికి పందల్లో నంబర్వన్ ..
శత్రువనిపించాడా..
ప్రమాదమైపించిందా..
ఠక్కుమని..తన డొప్పలో తలా కాళ్ళూ లాగేసుకోవటం..
నక్కీ..నక్కీ..భయం లేదనిపించాక..బయటకురావటం..
అబ్బో..నడకలో చాలా ఫాస్టు..
దాని తాబేటి నడక యెంత ఫేమసో..
ఇక బుధ్ధి బలం సంగతి చెప్పేదేముందీ..??
అదే పరుగు పందెం..
నీతో పరుగు పందెమా..?యేం..? యెగతాళా..?
అంది కోపంగా..
అబ్బే.. అలా అని కాదూ.. నీవు మరీ స్లో యేం కాదు.. అప్పుడప్పుడూ ఇలా పందేలూ అవీ వుంటుంటే.. నీ స్పీడూ పెరుగుతుంది.. చూసుకో మరి..
అంతే నంటావా..??
గేలి చేయట్లేదుగా..?
అస్సలులేదు..బొరుకొడుతూంది కదా.. యేంతసేపు ఈ అడవిలో ..యేడవటం ..
ఓ ఎంజాయ్ మెంటూలేదూ .. పాడూ లేదూ..అనీ..
ఏమంటావ్..??సరేనా..??
సరే అయితే..
కానీ నీవు మరీ ఫాస్టుగా పరిగెడతావేమో..??
లేదు .. లేదు.. నీ కోసం మెల్లిగానే వెళతాలే..
మరి ప్రైజ్ సంగతేంటీ..?
అవును కదూ..
ఆకులలములు తిని
బతికే వాళ్ళమే ఇద్దరం ..
చూద్దాంలే..మన పులి రాజు గారితో నీకు సన్మానం చేయిస్తా..
ఓకే..
ఓకే..
రేపు ఉదయం..
అందరినీ రమ్మంటానేం..
ఏమో బాబూ.. సరదాగానే ఉన్నా..గుబులుగా వుంది..
అలానే వుంటుందిలే అదో రకం ఎగ్జయిట్మెంటూ..వస్తా మరి....
సరే...
ఓ నక్కమామా..
ఏం కుందేలు పిల్లడా..
పిలిచి మరీ ..మాట్లాడుతున్నావ్..??
ఏంటి సంగతీ..??
రేపు నువ్వో సారి అడవి రచ్చబండకు రావాలి..
అల్లనే నీ స్నేహితులు కూడా..
ఆ ..ఏంటి సంగతీ..?
మంచి కుందేలు పిల్లను పెళ్ళాడబోతున్నావా..?
అదేం లేదులే.. గమ్మత్తొకటి వుంది..
ఏంటది..?
చెప్తే కానీ రావా..మామా..?
విషయమేంటో తెలియాలిగా.. అల్లుడూ..
అయితే విను..
రేపు..గొప్ప పరుగు పందెం జరగబోతోంది..
దాన్ని అడవి అడవంతా.. తిలకించాలి..
పరుగు పందెమా..??
జింకలకూ.. కంగారూలకా..??
కాదు మామా నాకూ.. తాబేలుకూ..
జోకేస్తున్నావా..??
తాబేలుకూ.. నీకూ.. ఏంట్రా..?
మతుండే మాట్లాడుతున్నావా.. లేదా..?
అదే వింత మరి మామా..
తాబేలు తొడచరిచి మరీ చెప్పింది..
రేపు నన్నోడిస్తానని..
అంత ధైర్యమే .. దానికి..??
దాని సిగదరగా..ఇదేం విపరీతం..??
రేపొస్తావ్ గా..
వస్తా.. వస్తా..
ఇదిగో ఇది విన్నావా..??
ఏదో..??
తాబేలుకూ..కుందేలుకూ పరుగుపందెమట..
నెమలి నాట్యం..కోకిల గానం విన్నాం గానీ..
ఇదేంటమ్మోయ్..??
కొత్తగావుంది..
అదే మరి..రేపు రచ్చబండ దగ్గరట..
పులిరాజాగారూ వస్తున్నారుట..
అయితే వెళ్ళాల్సిందే కానీ..
ఎలానూ .. తాబేలు ఓడిపోతుంది..
ఇక మజా ఏం వుంటుంది నా బొంద..
తాబేలు చాలా ఆత్మ విశ్వాసంతో వుందట గెలుస్తానని..
ఏ దేవుడో మాయచేయాలి..
లేకపోతే పందెంలోని కుందేలు కుంటిదైనా కావాలి..
చూడాలంటే..
రేపు రచ్చబండ వెళ్ళాల్సిందే..
రాజా వారూ..
రాజా వారూ..
ఏంటన్నట్లు గుర్రుమన్నరు.. పులి రాజు గారు..
తమకొక సంగతి విన్నవిస్తాను..
విషయం చెప్పు ..విసిగించ వద్దు..గుర్..
అదేనండీ..
రేపు రచ్చబండ దగ్గర నేనూ.. తాబేలూ..పరుగు పందెం పెట్టుకోవాలని అనుకున్నాం ..
మీరు అధ్యక్షత వహిస్తే..
ఏమిటీ..
నీకూ.. తాబేలుకూ..పరుగు పందెమా..
మాతోనే పరాచికాలా....
ఫోవయ్యా..పుల్లయ్యా..దీనికి నేను అధ్యక్షత వహించాలా..
వేరేం పనేం లేదా.. నాకూ..
ఒక వైపు అవినీతి ప్రక్షాళన బిల్లు పెట్టండి మొర్రో..అని ఆ కొంగ .. ఒంటి కాలిపై నిలబడి..చేపలూ అవీ.. తినకుండా..పది రోజులబట్టీ..నిరాహార దీక్ష చేస్తూంది..
మిగతా జంతువులన్నీ దానికి మద్దతూ..
దిక్కు తోచక చస్తున్నా నేను..
ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అవినీతి రేషన్ పంపిణీలో అవినీతి అంతెందుకూ.. నా కొడుకును..ఆ డ్రగ్స్ కేసు లోంచీ బయటకు లాగేసరికి నా తల ప్రాణం తోకకొచ్చిందనుకో..
అందుకే రాజావారూ.. అన్ని టెన్షన్సు మరపించేందుకు ఓ రిలాక్సేషన్ కావాలి కదా..??
పెద్ద వారూ..
పెద్ద మనసున్నవారూ..
తమరు కాదనరని కోటి ఆశలతో వచ్చాను..
అంతగా అడుగుతున్నావ్ గనక సరే..
థాంక్సండీ..
ఓకే.. ఓకే..
అలా .. అలా..
అడవంతా పాకిపోయింది..
రచ్చబండ కిక్కిరిసి పోయింది..
ఏదో ..చిన్న పందెం తమ ఇద్దరి మధ్యా.. అనుకుంది.. గానీ..
ఇంత హంగామా చేస్తుందా.. ఆ కుందేలు..
పులిరాజా గారూ వచ్చారా.. నక్కలేంటి.. జింకలేంటి.. ఏనుగులేంటి..
ఒలంపిక్ అంత బిల్డప్ ఇచ్చిందనమాట ఈ కుంక..
హతవిధీ.. ఏం చేయను..??
బెంబేలెత్తిపోయింది తాబేలు..
ఇక తప్పక..
బరిలోకి దిగింది..
స్టార్ట్..అంది కాకి..
అందరూఉ ప్రోత్సాహంగా.. చప్పట్లు కొట్టడమేంటీ..??విజిల్సేంటీ..??
ఇంతలో మెరుపులా మాయమైది ఆ టక్కరి కుందేలు..
తానేమో మెల్లిగా నడవటం..
అందరూ వ్యంగ్యంగా తలో మాటా.. అంటూండటం ..
తను వింటూనే వుంది..
పులిరాజా గారికి చెప్పలేనంత అసహనంగా వుంది..
గెలిచినవారికి సన్మానమట.. శాలవా.. పూలమాల.. మెరుపు వీరుడు.. బిరుదు ప్రదానమట..
దాని మెడ పొడవు అటు తాబేలునూ ఇటు కుందేలునూ..చూడగలదు..
మైక్ దొరికిందే చాన్సని తిక్కవాగుడు వాగుతోంది..
కుందేలు గమ్యం చేరలేదట..కానీ..
మొదటి మజిలీ దగ్గర కాళ్ళూపుకుంటూ ..కూచుందట..
తన రాక కోసం చూస్తూ..
అబ్బ.. తనిలా ఫిక్స్ అయిందేమిటిరా.. బాబూ..
దారి పొడవూతా ప్రేక్షకులే..
ఉత్సాహవంతుల ఈలలూ.. కేకలూ.. చప్పట్లూ..
తుంటరి వెధవలు రాళ్ళూ .. గుందుసూదులూ..టమాటాలూ..విసురుతున్నారు..
అయ్యో...గుడ్లు కూడా..
అమ్మయ్య..
మొదటి మజిలీ వచ్చేసింది..
అదుగో .. కుందేలు గాడిద తననే చూస్తున్నాడు..
వచ్చావా.. బావా..అయితే మళ్ళీ నేను ఉస్కో..
నములుతున్న క్యారెట్ ను గాల్లో ఎగరేసి తృటిలో మాయమైంది..
ఒక్కసారి నిస్సత్తువ వచ్చేసింది..
ఎలానూ.. ఓడిపోతుంది..
తర్వాత రాజా వారి ఆగ్రహాన్ని.. అడవి జనాల చీత్కారాన్ని..చవి చూడాలి గామోసు..
ఏరా ..తాబేలు పీనుగా బుధ్ధుండే ఈ గేముకు సై అన్నావా..
నీవెంత ..?? నీ బతుకెంత..??
అయినా ఆకుందేలుతో పోటీ ఏవిట్రా నీకు..??
నిన్ను తగలెయ్య..
జీబ్రా మైక్ లో అరుస్తోంది..ఎంతైనా ప్రత్యేకమైన పోటీ..
తాబేలూ.. నిరుత్సాహ పడవద్దు..
అన్నిటికంటే మనో బలమే గొప్పది..
చిన్న ప్రాణి కూడా ఎంతైనా సాధించగలదు..
కమాన్.. హరియప్..
దీనికేం ఎన్నైనా చెప్తుంది..
ఇంత పొడవు కాళ్ళు.. మెడా వేసుకొని ..
కానీ ఆత్మ రక్షణకు రెండు కొమ్ములైనా లేవు దానికి..
ఏ పులో .. సిం హమో..
వెనక పడితే యేం చేస్తుందిట..??
చచ్చినట్లు .. చచ్చూరుకుంటుంది..
ఆ... యేమంటోంది.. రెండవ మజిలీలో .. కుందేలు తొంగుందట..
ఆ.. అమ్మాయ్యా.. రెండవ మజిలీ వచ్చేసింది..
అదుగో.. నిజంగానే గురకేస్తోంది..
కళ్ళు తెరిచిందా.. నేను ఫినిషే..
కుందేలును దాటి కూసంత దూరం నడిచింది..
వెనుదిరిగి చూసింది..
అబ్బే.. లేవలేదు..
జనాలూ సంభ్రమంగా చూస్తున్నారు..
వీళ్ళు లేపి చస్తారేమో..
ఏయ్.. కుందేలు.. లే..
కుందేలు కూనా లేవరా..తాబేలు వెళ్ళిపోతోంది..
ఓరోరోరి .. గుంటడోయ్..లే.. తొంగున్నావేటీ..??
పందెంలో పరాచికాలా..లేరా..
ఊహూ..
కుందేలు కునుకు పూర్తి కాలా..
రాజావారికి..మొదట అర్థం కాలా ..కానీ ఆయనా ఆశ్చర్యంగా..చూస్తున్నారు..
కుందేలేం చేస్తూంది..??
పక్కన సలహాదారులు ఏం చెప్పమంటారు రాజావారూ..ఆ బుధ్ధిలేని కుందేలు తాబేలును నీచంగా తనను గొప్పగా ఎస్టిమేషనేసుకుని .. ఆ చెట్టు కింద నిద్దరోతోంది..
వాట్ నాన్సెన్స్.. యువార్ టాకింగ్..
ఇంతమందిని పోగేసి..
పైగా నన్ను ఇన్వయిట్ చేసి.. ఇలా ఇక్క వేషాలేస్తుందా..??
వుండు దీని పని చెబుతా..
తాబేలు లక్ష్యాన్ని సమీపిస్తూంది..
జనాల కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి..
అయిపోయింది..
తాబేలు గమ్యం చేరింది..
వగరుస్తూ నిలబడింది..
అక్కడ నెమలి అందంగా పూలమాలతో నిలబడివుంది..
తాబేలు మెడలో చటుక్కున మాల వేసింది..
జనాల హర్షధ్వానాలు మిన్నుముట్టాయి..
ఉలిక్కి పడి లేచింది కుందేలు..
ఓ నిమిషం కునుకు పట్టేసింది..
ఏం జరిగిందీ..??
కళ్ళు విప్పార్చుకుని చూసింది..
చిరునవ్వుతో.. నిలబడివుంది..
అందరూ అభినందిస్తున్నారు..
కుందేలును ఎవ్వరూ పట్టించుకోలేదు ఇక..
తాబేలును రాజా వారి దగ్గరికి తీసుకు పోయారు..
రాజావారు షేక్ హేండిచ్చారు..
భుజం తట్టారు..
మెరుపు వీరుడు టైటిల్ ను భుజంపైనుంచీ అలంకరించారు.
ఆ పై..
రాజా వారు ప్రసంగించారు..
దేనికైనా..ఆత్మవిశ్వాసం ముఖ్యమనీ..
ఎప్పుడూ లక్ష్యం పట్ల నిర్లక్ష్యం కూడదనీ..అంటున్నారు..
అంటూ నెమలి నృత్యం చేసింది..
మౌనంగానే ఎదగమనీ..మొక్కనీకు చెబుతుందీ..
అని కోకిల గానాన్ని అందరూ ఆస్వాదించారు..
నక్క తోడేళ్ళ కుర్రాళ్ళు
బ్రేక్ డాన్స్ .. యహీహై షేక్ డాన్స్ అంటూ హుషారుగా చేసారు..
గోరింక మిమిక్రీ..ప్రత్యేక ఆకర్షణ..
ఆనాటి కార్యక్రమం చిలుక వందన సమర్పణతో ముగిసింది..
ఆనాటి కుందేలూ తాబేలు.. కథ ఈనాటికీ సజీవంగా నిలచి
ఎందరికో స్పూర్తి నిస్తుంది..
అందరూ బాగా ఆనందించారు..
ఇకపై అప్పుడప్పుడూ ఇలాంటి వినోద కార్యక్రమాలుంటే బాగుంటుందని అనుకున్నారు కూడా..
ఈ హడావుడిలో కుందేలు వెనుకనుంచీ జారుకోవటం ఎవ్వరూ గమనించనేలేదు..
Saturday, August 27, 2011
సీతమ్మ మాయమ్మ.. శ్రీరాముడు మాకు తండ్రి..
సుమన దిగులుగా వుంది..
మురళి ప్రవర్తన ఆమెను కలవరపరుస్తూంది..
తను ఏకాంతంలో ఊపిరాడనట్లూ..నలుగురిలో ఒక్కడైనట్లూ..సతమతమవుతున్నాడు..
తన సమక్షం అతన్ని సంతృప్తి పరచకపోగా..మరింత అసహనానికి గురి చేస్తూందని తను గుర్తించింది..
దానికి తన వద్ద యేం ప్రత్యామ్నాయముంది కనుకా..?
తనూ ఓ చక్కని భర్త కోసం కలలు కంది..
అందమైన వాడు కాకున్నా.. మంచివాడు కావాలనీ.. ప్రేమానురాగాలు పంచాలనీ..
మధ్యతరగతి జీవితాలకింకేం కావాలి..?
కానీ ఆయన ఇంకేదో ఆశిస్తున్నాడు..
పైకి చెప్పడు..లోన దాయలేడు..
దానికి తనేం చేయగలదు..?
ఆందోళనపడడం తప్ప..
నిట్టూర్చింది..
ఆ వీధి చివరే ఓ .. రామాలయం..
భక్తి కోసం ..
కాలక్షేపం కోసం ..
వరాలకోసం ..
భక్తులు ఆ రాముణ్ణి దర్శిస్తూ వుంటారు..
తనూ ఆ రాముణ్ణే.. ఆశ్రయించింది..
మనశ్శాంతి కోసం .. పరిష్కారం కోసం..
రాయినైనా.. కాకపోతిని..రామ పాదము సోకగా..
బోయనైనా కాకపోతిని .. పుణ్య చరితము పాడగా..
అడవిలోపల ఉడుతనైతే ..అతివ సీతను గాంచనా..
అందువలనా రామ చంద్రుని వేలి గురుతులు మోయనా..
మహిని అల్పజీవులే ఈ మహిమలన్నీ..మోయగా..
మనిషినై జన్మించినా నే మత్సరమ్మును వీడనా..
మద మత్సరమ్మును వీడనా..??
సుశీల కమ్మని కంఠం వేదనలు వెదజల్లుతోంది..
మూగవోయిన మనసుతో ..సుమన ఓ చోట కూర్చుంది..నిస్తేజంగా..
ఏమ్మా.. వంట్లో బావోలేదా..??
పలకరించిందో ఆత్మీయ కంథం..
అమ్మాయి మనసు బావోలేదేమోనే..!!!
జతయిందింకో ..అనునయ వాక్యం..
మేము మీ ఎదురింటి కొచ్చామమ్మా..
వాళ్ళు మాకు చుట్టాలులే.. నీవు మమ్మల్ని గమనించలేదేమో..
నీవూ మా బిడ్డలా అనిపిస్తావనుకో..
ఎప్పుడూ..అలా దిగులుగా వుంటావు..
కొత్తగా పెళ్ళైన నీలాంటి ఆడపిల్లలు కళ్ళతోటే ఎన్నో కమ్మని కథలు వినిపిస్తారు..!!
తల్లిదండ్రులపై .. బెంగా..?
అబ్బే అదేం లేదండీ..
ఏం అనుకోకమ్మా.. నీ స్వవిషయాలవి.. చెప్పడం ..మానడం .. నీ ఇష్టం కదా..
సముద్ర మధనం జరిగిన తరువాతే..అమృతం బయట పడ్డ విషయం గుర్తుంచుకోమని చెప్పవే..
అంతే..
సుమన కళ్ళు హటాత్తుగా వర్షించాయి..
కళ్ళు తుడుచుకుని వస్తానండీ.. అంటూ గబగబా వెళ్ళిపోయింది..
పాపమే .. చిన్నపిల్ల..
అంతేకాదండీ.. వివేకమున్న పిల్ల..
చెప్పటమిష్టం లేకేమోనండీ..
కాదే.. బరువుగా సాగుతున్న నీలి మేఘమేం చేస్తుందీ..??
చల్లని గాలికే వర్షిస్తుంది..
సరిగ్గా .. ఈ అమ్మాయీ అందుకే హడావుడిగా వెళ్ళిపోయింది..
పలకవేమిటే..?
అబ్బాయి సరిగ్గా.. చూడట్లే దంటారా..??
అయిండచ్చు..కాకపోవచ్చు.. కూడా..
అతగాడూ .. అంతే .. సత్రం భోజనం .. మఠం నిద్ర.లావుంటున్నాడు తప్ప ..కొత్త సంసారపు మెరుపులేవీ..??
ఏం..చేద్దామంటారూ..??
అతన్నీ ఓ చూపు చూడాలి..
వైద్యుడన్ని కోణాల్నించీ ..పరిశీలించినట్టు..
నీవూ తెలివైన దానివే..
మరేమనుకున్నారూ..మీ అర్ధాంగిని మరి..
వాళ్ళు సీతారాములు..
వుద్యోగవిరమణ తర్వాత జీవితాన్ని ప్రశాoతంగా అనుభవిస్తున్న అదృష్టవంతులు..
ఇతరుల గాయాలు కెలికి కొంతమంది..సంతోషపడతారు..
ఆ సమస్యలను చిలువలుపలువలుగా లాగి దానికి మరింత మసాలాను జోడించి పదుగురికీ చెప్పి కాలక్షేపం చేస్తారు మరికొంతమంది..
సహృదయంతో ఆ గాయాన్ని కడిగి..
శుభ్రపరచి..దానికి తగిన మందువేసి శుశ్రూష చేస్తారు అతి కొద్దిమంది..
అలాంటివారే.. ఈ సీతా రాములు..
తమ దృష్టికి వచ్చిన సమస్యలను.. దాని బాధితులను..
తమకు తోచిన పధ్ధతిలో పెద్దరికంగా సరిదిద్దడమే.. వారు గొప్ప సమాజసేవగా భావిస్తారు.. కూడా..
అలా వారు పరిష్కరించిన సమస్యలనేకం..
కొన్నిసార్లు వారు తెర వెనుకే వుండిపోతారు..
అప్పుడప్పుడూ..తామే సూత్రధారులమని బయటపడతారు..
ఇతరులు తమను గుర్తించటం..
కృతజ్ఞత చూపించటం కన్నా..
వారు సమస్యలు తొలగి.. సుఖజీవనం సాగించటంలోనే తమకు తృప్తి.. ఆనందం దొరుకుతాయని వారు భావిస్తారు..
మురళి .. సుమనల ఎదురింటికి చుట్టపు చూపుగా..వచ్చారు..
పరిసరాలు పాత బడ్డాక మనుషులను పరిశీలిస్తూ.. పరిశీలిస్తూ.. వుండగా..
స్తబ్దుగా తిరుగాడే..సుమన కంటబడింది..వారికి..
కొత్తగా పెళ్ళయిన పిల్ల..
ఏదో పోగొట్టుకున్నట్టుంటే కారణమేంటీ..??
మనసులేని మనువా..??
మొగడి నిరాదరణా..??
అత్తమామల వేధింపా..??
ఏదో కొద్దిరోజులకొచ్చాం కదా...!!
మనకు సంబంధం లేని విషయాలలో తల దూర్చటం అనవసరమేమో అనుకోలేదు..
అలా అనుకుంటే.. వారు సీతారాములే.. కారు..!!
ఎవరైనా సహాయమర్థిస్తే..
పెద్దరికం వహించమని బ్రతిమాలితే..
మధ్యవర్తిత్వానికి రమ్మని ఆహ్వానమంపితే..
మొహమాటానికో ..ఇదెక్కది గొడవరా..బాబూ..అనుకుంటూనో..
సమస్య దగ్గరికెళితే.. వాళ్ళు సీతారాములెందుకవుతారు..??
విభిన్న కోణాల్లో సమస్యను పరిశీలించటం..
పరిష్కారానికి ఎంతటి సాహసానికైనా వెనుదీయక పోవటం వీరి ప్రత్యేకతలు..
కథానాయకుడైన మురళిపై వారు దృష్టి సారించారు..
ఏదో మొక్కుబడికి ఇంటి కి రావటం..
అప్పుడప్పుడూ..ఒకటి రెండు రోజులు రాకపోవటం..
ఇంటిపై .. ఇల్లాలిపై.. ఉత్సాహం లేకపోవటం..వారు గమనించారు..
సమస్యనిటునుంచీ నరుక్కు రావటం ఆరంభించారు..
ఇంతలో జరిగిందో సంఘటన ..
ఇంటి వెనుక పెరటిలో ..
స్నానపు నీళ్ళ బకెట్తుతో వచ్చింది సుమన ..
టవలు చుట్టుకొని వున్నాడు మురళి..
ఎవో మాటలు జరిగాయి..
కోపంగా సుమన చంపను ఛళ్ళుమనిపించాడు..మురళి
గుడ్లనీరు కక్కుకుంటూ లోపలికి పరిగెట్టుకెళ్ళింది సుమన..
ఇది కంటబడిన సీతారాములు ఇక ఆగలేక పోయారు..
ఈ అమ్మాయి..
అతని ముభావాన్ని..ప్రవర్తననూ .. తల్లిదండ్రులకెందుకు చెప్పదూ..??
సానుభూతి పరులకెందుకు విప్పదూ..??
లోలోన కుమిలిపోవటంలో అర్థముందా..??
అంటే..
అటు తల్లిదండ్రులకూ..
ఇటు అత్తమామలకూ..
వినిపించకూడని..
అతి రహస్యమైన సున్నితమైన చిక్కుముడా..??
ఆలోచించే కొద్దీ..
సుమనపై జాలీ..
తమ కర్తవ్యమూ..
తొందరపెట్టాయి..
కార్యరంగంలోకి దిగారు ఓ కృతనిశ్చయంతో..!!!
అతని దినచర్య గమనించారు..
ఆఫీసుదాకా వెళ్ళి ఆ పరిసరాలూ.. పరిచయాలూ..చూసారు..
వారినీ.. వీరినీ .. వాకబుచేసి.. అబ్బాయి గుణగణాలూ.. అలవాట్లూ..విచారించారు..
కొందరు గుసగుసగా..
కొందరు నర్మగర్భంగా.. అతన్ని గురించిన ఏదో విషయాన్ని దాయడానికీ ..బహిరంగపరచదానికీ..ప్రయత్నిస్తున్నట్లు అనుమానమొచ్చింది..!!
మరింత ప్రయత్నిస్తే..
అతనికి ఓ మోడల్ తో పరిచయం .. స్నేహమై .. తర్వాత..మోహమై..ఇప్పుడు అక్రమ సంబంధమైనట్లు ఖరారుగా తెలిసింది..
ఓ యాడ్ ఏజెన్సీలో నిత్యం రకరకాల కాగితపు పూవుల ఆర్టిఫిషియల్ అందాల మధ్యా కృత్రిమత్వం నింపుకున్న నవ్వులూ.. అసహజమైన .. అవసరార్థపు పలకరింపుల వాతావరణంలో ..ఎప్పుడూ ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో..అతను ఉద్యోగం చేయాలి..
పొద్దున్నే దారి తప్పి పాల పాకెట్టుకు వచ్చాడు మురళి..
ఉదయపు నడకను జంటగా ఆస్వాదిస్తూ వస్తున్నారు సీతారాములు.
అక్కడ ఆగి మురళిని పలకరించారు..
ఏం బాబూ.. పాలకా..??మీరెవరన్నట్లు చూశాడు మురళి..
మేం మీ ఎదురింటికొచ్చిన ఓల్డు జంటలం బాబూ..
నీవు మమ్మల్ని గుర్తించి వుండవులే..
వురుకులూ పరుగుల వుద్యోగాలూ.. జీవితాలూ..
అయితే ఏంటన్నట్లు చూశాడు..
ఏం లేదు బాబూ .. సుమన మాకు దూరపు బంధువు అవుతుందీ..
మరీ దూరం కాదనుకో..!!
మరీ దగ్గరా కాదు..
వాళ్ళ అమ్మా నాన్నలు మాకు బాగా తెలుసు..
అమ్మాయెందుకో ..ఏదో..విషయాన్ని మనసులో దాచుకుని బాధపడుతున్నట్లుంది..
అమ్మాయెందుకో ..ఏదో..విషయాన్ని మనసులో దాచుకుని బాధపడుతున్నట్లుంది..
ఆ యేముందిలే ఏ..అత్తగారో.. ఆడపడుచులో వుంటే వాళ్ళ వల్ల బాధపడుతుందనుకోవచ్చు..
అయినా వాళ్ళూ .. బంగారం లాంటి మనుషులైరీ..!!
నీవా మచ్చలేని కుర్రాడివీ.. చక్కటి వుద్యోగస్తుడివీ..
అలాగని దూరం తోసేయలేంగా..!!
వెళ్తానండీ..నాకు పనుంది..
అవునవును అబ్బాయికి పనులుండవేమిటే పొద్దున్నే నీదోసోది...
కన్నవాళ్ళ్కు చెప్పదూ..
అయిన వాళ్ళకూ చెప్పదూ..
తిన్నదరక్క...ఏవో పిచ్చి ఊహల్తో బాధపడితే నేనేం చేయనూ..??అయినా మా విషయాలు మీకెందుకండీ..??
ముసలాళ్ళు రామా.. కృష్ణా అనుకోక..దేశోధ్ధరణకు బయలుదేరారా..???
అలాగనకు బాబూ..
ఏదో .. అయిన వాళ్ళ పిల్ల.. తప్పుచేస్తే..దండించాలి దూరం పెట్టకూడదు..!!భర్తవు నీవే ఆ పిల్లను కనుక్కోవాలి..
అలాగని చెప్పిందా..??
అదే ఆ పిల్ల సంస్కారం పెదవి విప్పదుగా..!!
చెప్పారుగా ఇక వెళ్ళండి..
చూస్తూ.. చూస్తూ.. చూసీ చూడనట్లు వెళ్ళలేంగా..బాబూ..
ఏం అనుకోకు నాయనా.. ఏపిల్ల అయినా మన పిల్లే అనుకునే చాదస్తం.. ఏదో పెద్ద వాళ్ళం..
వెళ్ళాలి ..ఆఫీసుకు టైమైంది..ఎంతోమంది అందమైన ఆడవాళ్ళ మధ్య నా ..ఉద్యోగం
ఒక అనాకారిని దయదల్చి పెళ్ళి చేసుకున్నాను.. ఓ జీవితమిచ్చాను.. చాలదా...ఇంకేం చేయాలి నేను..??
ఆ పిల్ల నన్ను పెళ్ళాడు .. నాకు జీవితమివ్వూ అని ..నిన్ను బ్రతిమాలిందా..??
తలిదండ్రులూ..అయినవాళ్ళూ లేని అనాధనని నీకు చెప్పిందా..??
ఏం బాబూ పలకవేం..??
అసలు అడగడానికి మీరెవరండీ..?? మీకెందుకు జవాబు చెప్పాలి నేను..?? హద్దుల్లో వుండండి..
విస విసా వెళ్ళిపోయాడు మురళి..
ఏమే ఏదో అందినట్టులేదూ..??
అవునండీ..అందం .. చందం.. అంటున్నాడు..
ఆఫీసులో అన్నీ అందాలేనాయే .. ఆప్రవాహంలో పడి కొట్టుకు పోతున్నట్లున్నాడు..!!
కథకిదే .. మొదలా..చివరా.. చూద్దాం..!!!
అనుకున్నదంతా అయింది..
ఇప్పుడాపిల్ల జీవితం చక్కబరచాలిమనం..
పరస్త్రీ వ్యామోహంలో పడ్డవాడినీ..కుడితిలో పడ్డ ఈగనూ.. తప్పించటం సాధ్యమా..??
వ్యామోహమని నీవే అంటున్నావుగా..అసలుకూ నకిలీకీ.. తేడా తెలియజేయాలి ఆ కుర్రాడికి..
వైద్యమెటునుంచీ మొదలట..??
మూలం దొరికిందిగా..ఎటునుంచయినా నరుక్కురావచ్చు..
***
ఆ పిల్ల పేరు సోనాలీ..
బొంబాయి భామ..
ఏదో యాడ్ అగ్రిమెంట్పై ఇక్కడ వాలింది..
అనుక్షణం రూమర్స్ లోనైనా సరే వార్తల్లో వుండాలనుకునే తత్వం..
మగ స్నేహాలూ ఫుడ్డూ.. బెడ్డూ పంచుకోవటమామెకు చాలా సింపుల్..
మురళి లాంటి సాధారణ ఉద్యోగికి సోనాలి అందడం అంత సులభం కాదు.. కానీ..
లక్షల్లో పారితోషిక మందుకునే సోనాలీకి ఈ అందాల పిచ్చోడు సరదాగా అసిపించాడు..
కాస్త చనువిచ్చింది..కొంచం ఆనందమిచ్చింది.. ఆమె కదో వింత అనుభవం..
స్వర్గమే అందినంత ఆనందపడిపోయాడు మురళి..
ఆ రోజు సోనాలీ మురళి బయటికి వెళ్ళాలనుకున్నారు..
భుజాలు నగ్నంగా వక్షాలు కవ్వింతగా..జీన్సులో ఇమిడిన నాజూకు శరీరం వదలలేనంతగా..
అలరించాయి మురళిని..
హోటల్ లో సన్నటి వెలుగులలో మురళీ సోనాలీ డాన్స్ చేస్తూ.. కంటబడ్డారు సీతారాములకు..
వాళ్ళో బర్త్ డే ఫంక్షన్ కు వచ్చారు అక్కడికి.
అదిగో చూశారా..??ఆ అబ్బాయే..
అవునేవ్ .. ఆపిల్ల .. ఆపిల్లేనా..??
మెల్లగా అంటారేమిటండీ..??అతుక్కుపోతుంటేనూ..??
ఏంచేద్దామంటావిప్పుడూ..??
ఇలా రండి..
లాక్కు వెళ్ళింది పక్కకి సీతమ్మ తల్లి..
సోనాలీ మురళి డాన్స్ చేసి చేసి..అలసి కుర్చీల్లో కూచుని విదేశీ మద్యం సేవిస్తున్నారు..
హాయ్.. సోనాలీ..
హల్లో సోనూ..
ఓ జంట ప్రవేశించింది..
ఎవరు మీరు..??
మమ్మల్నే కనుక్కో లేదా..??మీ తల్లి పినతండ్రి అక్క పిల్లలం..మీ అమ్మకు మేమంటే ప్రాణం..
వగలొలికింది సీతమ్మ మారువేషంలో..
మా .. అమ్మ ఇప్పుడులేదు చని పోయింది..
తెలుసూ..నిన్ను పిల్లప్పుడు చూసాం..ఇప్పుడు పెద్దయ్యావ్ గానీ మా కెప్పుడూ చిన్నపిల్లవే..
నీవు గుర్తించలేదు..మేం ఠక్కున గుర్తించాం..చూశావా..??
సోనాలీ ముఖంలో ఆనందం కనిపించింది..
అంతా తల్లిని పోలావ్..ఇతనెవరూ..??
నా బాయ్ ఫెండ్..
డబ్బున్న వాడేనా..??
ఇబ్బంది పడ్డారిద్దరూ..
మర్చిపోయా నీ కోసం ఓ పెద్ద బిజినెస్ మ్యాగ్నేట్ కాచుక్కూచున్నాడు బొంబాయిలో .. నిన్నో యాడ్ లో చూశాడట..
పది రోజులనుంచీ ఒకటే వాకబు ..నీ గురించి..
అలాగా..??
సోనాలీ ముఖంలో ఆనందం కనిపించింది..
అంతా తల్లిని పోలావ్..ఇతనెవరూ..??
నా బాయ్ ఫెండ్..
డబ్బున్న వాడేనా..??
ఇబ్బంది పడ్డారిద్దరూ..
మర్చిపోయా నీ కోసం ఓ పెద్ద బిజినెస్ మ్యాగ్నేట్ కాచుక్కూచున్నాడు బొంబాయిలో .. నిన్నో యాడ్ లో చూశాడట..
పది రోజులనుంచీ ఒకటే వాకబు ..నీ గురించి..
అలాగా..??
ఇలా చిన్న చిన్న కేసులకు నిలబడిపోతే..ఒళ్ళు పాడయిపోదూ..??
దీపముండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలి పాపా.. త్వరగా బయలుదేరు.ఫ్లైట్ ఇంకో అరగంటలోనే..
అలాగే..
ఇదిగో ఫోన్ నెంబరు..ఇవిగో టికెట్లు..ఆలశ్యమైతే అతను బెల్జియంకు రవాణా అయిపోతాడు..
టికెట్లందుకుంది..వేగంగా..
సోనాలీ..
వినిపించుకోలేదు..
సోనాలీ..
గొంతు బొంగురుపోయింది..మురళికి..
నేను వెళ్ళాలి..
మరి నేనూ..??
చీదరగా చూసింది..గో టు హెల్..
ఎత్తు చెప్పులు టక టక లాడించుకుంటూ వెళ్ళిపోయింది..
బిక్క మొహంతో చూస్తున్నాడు మురళి..
సీతారాములు విలాసంగా చూసారు మురళిని.
మీరు.. మీరే.. సోనాలిని నానుంచీ దూరం చేసారు..
మేమా..??
ఆమె వాడే సెంట్ బాటిలంత వుండదు నీ బతుకు..నీకు సోనాలి కావాలా..??
మెల్లగా అతికించుకున్న గడ్డం తొలగించాడు రామయ్య..
మహాలక్ష్మి లాంటి భార్యను ఇంట్లో వుంచుకుని పై రుచులకు అలవాటు పడడం మంచిపనేనా..?
సీతమ్మ విగ్గును తీసేసింది..
మీరా..
ఆ మేమే.. నీ కళ్ళు తెరిపించటం కోసమే ఇదంతా..
అసలు మీరెవరు..?? నా జీవితంతో ఆటలాడే అధికారం మీ కెవరిచ్చారు..??
నేనెవర్తోనైనా తిరుగుతానూ..ఏమైనా చేస్తాను.. అడిగే అధికారం మీకు లేదు..
మరి నీ భార్య జీవితంతో ఆటలాడే అధికారం నీకుందా..??
ఆమెను పెళ్ళాడి ఆపై నిర్లక్షయం చేసి వేరొకరితో తిరిగే హక్కు నీకుందా..??
అది భార్య కాదు శని..ఆ అనాకారిని బతుకంతా భరించాలా..??
సరే మరి నీవిష్టపడిన వగలాడి నిన్ను అంతిపెట్టుకుని వుందా..??
ఎవరో ధనవంతుడు రెడీగా వున్నాడనగానే ..వుడాయించింది..
అక్కడే నీవు భార్యకూ వేరొకరికీ వున్న తేడాను తెలుసుకోవాలి..
నీవింటికి వెళ్ళగానే నవ్వుతూ తలుపు తీసి.. ప్రేమగా భోజనం తినిపించీ.. కమ్మగా కబుర్లు చెప్పీ..
నీ కోసం కలలు కనీ .. ఆరాటపడీ..
నీ పిల్లలకు తల్లై ..వారిని ప్రయోజకులను చేసి.. నీ వంశానికి మూలాధారంలా నిలిచే స్ఠిరమైన ఆడదీ..సంస్కారవంతురాలూ .. భార్యగా దొరికిన మగవాదు ఎంత అదృష్టవంతుడో నీకు తెలియదయ్యా..
నా భార్య చూడూ..
పొట్టిగా..లావుగా.. నెరిసిన జుట్తుతో .పిల్లలను కనీ పటుత్వం తగ్గీ..
అయినా నా కెంత సుఖసంతోషాలనూ.. మనశ్శాంతినీ ఇచ్చిందనుకున్నావ్..??
ఇది కంటనీరు పెడితే నా మనసు తల్లడిల్లుతుందయ్యా..
దీని చిరునవ్వే నాకు కొండంత బలం..
ఇది నా వెన్ను తట్టిందనుకో .. ఆంజనేయునిలా సముద్ర లంఘనం చేయ గలిగినంత ధీమా నాకొస్తుంది..
పసివాడివి ఇవన్నీ నీకు తెలియవు..
తెలియ జెప్ప వలసిన బాధ్యత మా పెద్దవాళ్ళది..
అదే మన సభ్యత .. సాంప్రదాయం..
అదే మన హిందూ వివాహ వ్యవస్ఠలోని గొప్పదనం..
క్షణం ఆగాడు రామయ్య..
సీతమ్మ కళ్ళలోకి ప్రేమగా.. ఆరాధనగా చూశాడు..
సీతమ్మ సిగ్గుపడింది..
రామయ్య చేతిలో తన చేతిని వేసింది..
చూడు బాబూ ఓ విషయం చెప్పనా..
ఒక స్త్రీకి కళ్ళే అందం..
ఇంకొకరికి చెక్కిళ్ళు అందం..
కురులందం ఒకరికి..చిరునవ్వు అందం ఇంకొకరికి..
మాట తీరు అందంతో ఆకట్టుకొంటారు కొందరు..
చక్కని పని పాటలతో అలరిస్తారింకొందరు..
పరిపూర్ణమైన అందం దొరకటం సాధ్యం కాదు బాబూ..
గొప్ప వ్యక్తిత్వమే నిజమైన సౌందర్యమ్రా.. కన్నా..
వెళ్ళు.. వెళ్ళి..అమ్మాయిని అభిమానంగా చూసుకో ..
జీవితం చాలా విలువైంది.
దీన్ని వృధా చేసుకోవద్దు..
మురళి లేచాడు..
నెమ్మదిగా నిష్క్రమించాడు..
Subscribe to:
Posts (Atom)







