Saturday, May 7, 2011

లేఖిని నాది మాటలు మనసువి: లేఖిని నాది మాటలు మనసువి: లేఖిని నాది మాటలు మనసువి...

లేఖిని నాది మాటలు మనసువి: లేఖిని నాది మాటలు మనసువి: లేఖిని నాది మాటలు మనసువి...: "లేఖిని నాది మాటలు మనసువి: లేఖిని నాది మాటలు మనసువి: నా బ్లాగులో స్లయిడ్ ... : 'లేఖిని నాది మాటలు మనసువి: నా బ్లాగులో స్లయిడ్ షో మార్చ..."

సరస్వతీ నమస్తూభ్యమ్... మదర్స్ డే సందర్భంగా..







నలువ వలపులరాణి..
కలికి నెమలిని ఆని..
అలవోక రాగాల వల్లకిని సవరించ..
పలుకు తేనెలపాట..పెదవి నవ్వుల జార..
ఆనంద సంద్రాల జగములూయలలూగె
లలిత కళలకు తనువు ఉల్లలితమైపోయె..













నమస్తే..నమస్తే..అక్షర స్వరూపిణీ..
నమస్తే..నమస్తే..లీలా విలాసినీ..
నమస్తే..నమస్తే..బ్రహ్మాండ నాయకీ..
నమస్తే..నమస్తే..సురలోక పూజితా..






నలువ నాలుక పైన నాట్యాలు చేసేవు..
మునుల వందనమంది..పరమపదమిచ్చేవు..
నాల్గు వేదాలలో ..సకల శాస్త్రాలలో..
కావ్యాలు..గేయాలు..కృతులు..కీర్తనలలో..
విశ్వ రూపము నిలిపి ..పిలచి నంతనే పలికి..
చదువులకు తల్లిగా ..వందనము లందేవు..







సంగీత సాహిత్య నాట్యాలు ఒకవైపు..
చిత్రలేఖన శిల్ప కళలన్ని ఒకవైపు..
దేవదేవిని చేరి కీర్తించబూనాయి..


ముందుగా సంగీతమే పలుకు విప్పింది..
తన చరిత రీతులకు అశ్రువులు కలిపింది..







చిరుగాలినై..చెట్టు..పుట్టలను తిరిగాను..

సుడిగాలినై..కొండ కోనలకు ఎగసాను..
సెలయేటి అలలలో పిల్లగాలికి మల్లె..
పిచ్చి తిరుగుళ్ళలో ..సుడులు సుడులయ్యాను..






ఏనాటి పుణ్యమో..నీ కరుణ కిరణమై..
కరడు గట్టిన పాప తిమిరాన్ని తరిమింది..


జడమైన నా ఉనికి అమృతమయమయ్యింది..

సరిగమలో నేను పరవళ్ళు తొక్కాను..
గమకాలలో గాన గాంధర్వమైనాను..


ఎందరో గాయకులు సంగీత ఝరులలో..
ధన్యులై తడిసారు..అమరులై నిలిచారు..

రామ చంద్రుని కొలిచె కీర్తనల త్యాగయ్య..
కృష్ణయ్య కట్టుబడె మీర ప్రేమకు ప్రభుగ..

కడలేని సంగీత వాసంత విభవాన..
పరవశించితి నేను..అణువణువు అణువణువు..



నా గురివి నేవె కద..
నా గమ్యమే నీవు..
గమనమే నీవమ్మ..
సద్గురువు నీవేను..






అరమోడ్పు కనులతో..
ఆర్ద్ర హృదయమ్ముతో..
గళమిప్పె శిల్ప కళ..
కలల వాకిలి తెరువ..










ఎండలకు ..వానలకు..
తుంటరి ..తుఫానులకు..
బండనై ..మొండిగా..
బ్రతుకు ..సాగించాను..


నిర్జీవ నీరధిన ..
నిర్ణిద్ర శక్తిలా..
నిస్తేజమై..
నిండు నిప్పులను నమిలాను..



విత్తు నుంచీ..తరువు..
తరువునుంచీ..విత్తు..
ఆర్త హృదయానికే..
కదలు దైవత్వమ్ము..



నాటి నుంచీ .. నన్ను ఉలి పలకరించింది..
నిలువు.. నిలువున ..నన్ను కదిలించి మురిసింది..





జడమైన నా మేను జల జలా..పొంగేను..
శిల్పి ఆవేశానికభినేత్రి నయ్యాను..


శారదే..నీ కరుణ..
వర్ణించ ..నా తరమ..
వదలలేనమ్మ..
నీ పద యుగళి నీ జన్మ.. 


అంతలో సాహిత్య రాణి వాణిని విప్పె..
గుండె లోతుల ప్రేమ వడి వడిగ ప్రవహించె..





                         

  నీవే చదువుల తల్లివి..
వీణా పుస్తక ధారిణి..
వాగ్దేవివి వర ముద్రతొ..
ఐం..బీజా మయివైతివి..








ఉపాసించె కాళిదాసు..ఐం..బీజము నాదిలో..
సిధ్ధిత్వము నొంది నిలిచె మహాకవిగ ఇలలో..


శుక శౌనకాదులూ..వ్యాస వాల్మీకులూ..
నన్నయ్య..తిక్కన్న..ఎర్రన్న..పోతన్న..
సాహితీ మధనాన్ని..తనివారగా చేసి..
కావ్య హారతి నీకు నిండుగా పట్టారు..








నిను బొగడ నేనెంత..
నీవె కళలకు పుంత..
కావవే ..వేద మయి..
కావవే ..భక్త నిధి..
   



                            


తకిట..తక..తకిట..తక..  
తక ..తకిట..తక..తకిట..


ధిమి.. ధిమి.. ధ్ధిమిధ్వనుల 
దివిని సందడిరేప.. 
నాట్య సఖి అరుదెంచె..
అందెలతొ చిందులిడ..


చిరు మందహాసమ్ము..
శర్వాణి చిలికించె..
నాట్య సఖి హృదయమ్ము..
పురివిప్పె పింఛమై..


పెదవి దాటనె లేదు ..పలుక దలచిన మాట..
ఎదురాయె దైవమే..గురువయ్యి..తెరువయ్యి..


జీవమే చరణాల దక్షిణగ అర్పింతు..
నాట్యాభిషేకాన..అంజలిని ఘటియింతు..


(అందరూ కలిసి..)


అవధరించుము.. దేవి..శర్వాణి..గీర్వాణి..
భగవతీ..భారతీ..సర్వార్థ సంధాత్రి..
అభిలషార్థమునిమ్ము..ఆత్మ స్థైర్యమునిమ్ము..
నిన్ను సన్నుతి చేయ నిండు హృదయమ్మిమ్ము..
విశ్వ శాంతికి కళలు కదలు కార్మికులుగా..
నిస్వార్థముగ నడచు దివ్య సంస్కృతినిమ్ము..






Friday, May 6, 2011

లేఖిని నాది మాటలు మనసువి: లేఖిని నాది మాటలు మనసువి: ఇలాంటిదే ఇంకో ఇస్టోరీ....

లేఖిని నాది మాటలు మనసువి: లేఖిని నాది మాటలు మనసువి: ఇలాంటిదే ఇంకో ఇస్టోరీ....: "లేఖిని నాది మాటలు మనసువి: ఇలాంటిదే ఇంకో ఇస్టోరీ.. పాపం..రాజు అంటే నేను కొత... : 'ఇలాంటిదే ఇంకో ఇస్టోరీ.. పాపం..రాజు అంటే నేను కొత్త పెళ్ళి..."

పుట్టపర్తి అనూరాధ అక్షర కలశం: నేను సాయిని వెళ్ళిపోతున్నాను..మానవాకృతి దాల్చిమా...

పుట్టపర్తి అనూరాధ అక్షర కలశం: నేను సాయిని వెళ్ళిపోతున్నాను..మానవాకృతి దాల్చిమా...: "నేను సాయిని వెళ్ళిపోతున్నాను.. మానవాకృతి దాల్చి మాధవులుగా మిమ్మల్ని మార్చాలని బయలుదేరాను.. సేవయే సాధనమని బోధించాలనుకున్నాను.. కృతకృత్యుడనయ..."


నేను సాయిని వెళ్ళిపోతున్నాను..
మానవాకృతి దాల్చి
మాధవులుగా మిమ్మల్ని మార్చాలని బయలుదేరాను..
సేవయే సాధనమని బోధించాలనుకున్నాను..
కృతకృత్యుడనయ్యానో..లేదో..
గతంలో..అధర్మం పెచ్చు పెరిగినప్పుడు..
ధర్మాన్ని ఉధ్ధరించడానికి వచ్చేవాడిని..
భక్తి పారవస్యంలో జనం 
పరవశించేవారు..
రాక్షసత్వాన్ని రూపుమాపి..
అవతార సమాప్తి చేసి వైకుంఠం చేరేవాడిని..
ప్రేమ సూత్రం నా అవతారాన్ని 
పరిమళింపజేసింది..
సేవా మార్గం నా ప్రియ భక్తుల పరమ ధర్మం అయింది..
ఋషుల యజ్ఞాల్లో రక్త మాంసాలు..
గుమ్మరించింది ఆనాటి రాక్షసత్వం..
భగవానుడినైన నన్నే..
బందీని చేసింది ఈనాటి రాక్షసత్వం..
ప్రేమనూ సేవనూ మానవత్వాన్నీ బోధించిన
ఎవ్వరినీ..బ్రతకనీయరు వీరు..
ఈనాటి రాక్షసులను అంతమొందించడానికి..
కొత్త వ్యూహంతో రావాలిక..
ఏనాటికైనా..శాంతి,సమైక్యతే ప్రపంచాన్ని రక్షించేవి..
నా..వారు..అనుకున్న వారూ..
నేను ..వారి వాడిని తలంచిన వారూ..
ఈ మంత్రాలను మరువకండి..
వుంటాను..
ప్రేమతో..
సాయి

Friday, April 29, 2011

పుట్టపర్తి అనూరాధ అక్షర కలశం: kavitalu

పుట్టపర్తి అనూరాధ అక్షర కలశం: kavitalu: "అక్షరాలు తడబడుతూన్న..కలంలోంచీ.. ముడివడుతున్న..గళంలోంచీ.. సుడివడుతున్న..అశృకణంలోంచీ.. ధారలుగా.. ధారలౌ..రసాంబుధులుగా.. తరగలుగా..తరళములౌ..హి..."


  1. అక్షరాలు

తడబడుతూన్న..కలంలోంచీ..
ముడివడుతున్న..గళంలోంచీ..
సుడివడుతున్న..అశృకణంలోంచీ..
ధారలుగా..
ధారలౌ..రసాంబుధులుగా..
తరగలుగా..తరళములౌ..హిమలహరులుగా..
జాలువారేవి..ఈ అక్షరాలు..
కావు..కావివి..
ఎక్కడో..
వసంత సౌరభాలు నిర్గళితమైతే..
ఇక్కడ మధుకుల్యలపై..తేలునట్లు..
తత్తరపడు..వెర్రి మలయానిలాలు..
కావు..కావివి..
భీకరారుణిమలు..నిగిడారిన గగనార్ణవాన..
హర్ష ప్లావితమై ఎగిరే..
వెర్రి పారావతాలు..
నీ కొరకే ..నలిగిపోయి..
నీ కొరకే..చితికిపోయి..
అస్పష్ట జీవిత చిత్రాలుగా..మిగిలిన..
లలనల వ్యధా సందేశాలు ..
ఈ అక్షరాలు..
అతివలుగా..
కలపుంస్కోకిల..హేలాగతిగా..
కుహూకరించు..నవ్య వసంత యామినులు..
సబలలుగా..
ధరణీ మండలమామూలాగ్రమూ..
సుగంధిలమొనరించు..
ఆ గండూషిత విక్రమాలు..
ఆ ధిషణకు అబ్బురపడు..
ఏ వాచస్పతియైనా..
ఆ కరుణకు సాటిరాదు..
ఏ దీధితియైనా..
ఆ స్మితరేఖాబ్దుల చల్లదనాలకు..
ఆ కాంక్షారహిత హృదయోపహారములకు..
ముకురములై భాసించునవీ..
అక్షరాలు..
వీరు లేనిది..ప్రభవింపవు..
నీ తూర్పున..సుప్రభాతాలు..
వీరు లేనిది విరియబోవు..
నీ వసంతాన హిమస్నపిత సుమ నికుంజాలు..
పెంపారు మమతలను..
నిభృత దయాంతరంగిణియై..
కురిపించును మాతృమూర్తి నీ..అంతరంగాన..

చిరునవ్వుల..మువ్వలు సవ్వడించి..
మురిపించు..సోదరి నీ సన్నిధానాన..

లతాంత నీరజులెదను వుప్పొంగించి..
వాసంత సీమంతినియై శోభించు..
ప్రేయసి..నీ ప్రణయ బృందావనాన..

నీవు కన్ను తెరచినదిమొదలు..
వీచీ హస్తములెత్తి పర్వులిడు సాగరాలై..

నీపై రోచిస్సులు వర్షించే..
మమతానురాగాల మాలలు వీరు..
కానీ..
నీ..పురుషాహంకారపు అగ్నికీలల నడుమ..
నీచే కమ్మిన తమో జ్వాలల నడుమ..
నిరంతరం కుంగిపోయి..
తర తరాల ఇనుప పాదాల కింద..
అనుక్షణం నలిగిపోయి..

గహన కాననములెదలో అలముకొనగా..
అగ్ని మౌక్తికాలు నీకు కానుకలిస్తూ..
అశృగీత మాలికలను..మౌనంగా పలికించే..
వల్లకే యోషల అవ్యక్త స్వరాలు..
ఈ అక్షరాలు..
పాలవాగులెదలో వెల్లువైన పారవశ్యాన..
విధృతమైనవి కావీ..అశ్రు సరిత్తులు..

తీగలువారు వేదనల..
తుంపెసలాడు భావనలు..
తారసిల్లిన తరుణాన..
నిమీలితమైన నయనాల మాటున..
నిస్యందనమైన రసధారలు..
ఈ అక్షరాలు..
తలచవద్దు..ఇవి కేవలం..అక్షరాలని..

అవసరమైతే..విప్లవప్రళయాలను
భౄచలనసంకేతాలతోనే..సృష్టించగల..
విస్పులింగాలు..ఈ అక్షరాలు..

తలచవద్దు..ఇవి కేవలం వర్ణక్రమాలని..

అవసరమైతే..నీ చేతస్సున పరివృతమైన..
క్షుద్ర గర్వాన్ని..దావాగ్నిలా..
దహించివేయగల క్షోదక శక్తులు..

ఈ అక్షరాలు..