కృష్ణాష్టమికి అయ్య రాసిన మధురమైన కృష్ణగీతాలు అలనాడు ఆకాశవాణిలో ప్రసారమయ్యేవి..అవి ఇవే..చదివి ఆనందించండి..
వరు భూషించిరో ఇందిరేశ కృష్ణా..
భువనావన ఎంతో ముద్దు గురియగా..
ఎవరు భూషించిరో.. ఇందిరేశ కృష్ణా...
యాదవులో.. దేవతలో..అప్సరలో..గోపికలో..
ఆదమరచి భక్తాగ్రేసరులో..మోహనమగునిన్నూ..
ఎవరు భూషించిరో ఇందిరేశ కృష్ణా..
కటితటమున కరముతో .. ఘటియించిన పించముతో..
చటుల నూపురములతో .. సరిగ పీతాంబరముల నిన్ ఎవరు..
అష్టాక్షరిమంత్రాధిష్టానమ్మగు రూపముతో..
ఆర్త రక్షక భక్తులు అనురాగాంబుధినిండగ.. ఎవరు..
ఉత్తముల సంగతీ నాకిచ్చి మనుపుమా
చిత్త జనకా మురవైరి కృష్ణా..
మరి మరీ పుట్టలేను..
పరబాధ గనలేను..
పరిపరీ కష్టముల ..
అనుభవింపలేను..
జనన మరణములనూ..
పరిహరింపుమురా..
కరుణా సముద్రా..
మురవైరీ..కృష్ణా..
ఉత్తముల సంగతీ నాకిచ్చి...
నిన్ను నమ్మిన పిదప అన్యాశ్రయంబేల..
పన్నంగ శయనా.. పాలింప వయ్యా..
మున్ను భక్తులనెల్ల..చెన్నార గాచితివి..
కన్నయ్య నను బ్రోవ కాల హరణంబేల...
ఉత్తముల సంగతీ..
ప్రజానందుడదిగో..అదిగో..
యమునా హృదయమ్మదిగో..ప్రజానందుడదిగో..
రణద్వేణువదిగో..అదిగో..
రాధాధిక సుందరుడల్లదిగో..
ప్రజానందుడదిగో..
సుమాతల్పమదిగో..అదిగో..
రమాకాంతుడదిగో..
స్ఫురన్నూపురములా ..
ఝణ ఝణ..విరావమ్ములదిగో..
ప్రజానందుడదిగో..
పరబ్రహ్మ మదిగో..అదిగో..
అష్టాక్షరి రూపమ్మల్లదిగో..
సురానందమదిగో..అదిగో..
నిరాధారులకు నిజమగు పెన్నిధి..
ప్రజానందుడదిగో..
ఒయ్యారముగ రారా శ్రీహరి..
ఒయ్యారముగ రారా..
వయ్యాళి చూపుల దియ్యంబుగొలుపుచు..
సయ్యాటలను మరునయ్యా దాసుండని..
వయ్యారముగ రా..రా..
కరానగల వేణు నాళముతో..
ఖగేంద్రవాహన గమనముతో..
నిరాదరణ సేయరాదు యదుపతి ..
సారంబుగా నష్టాక్షరి బట్టిరి..
ఒయ్యారముగ రా..రా..
యమునా తటిలో ..
తిరిగెడి వాడట..
చెలియా చూచితివా..
ఓ..చెలియా.. చూచితివా..
ఆ..అడగని అలకలతో..
ఆవుల క్రేవులతో..
ఆతడబడు నడకలతో..
యమునా తటిలో ..
తిరిగెడి వాడట..
చెలియా చూచితివా..
ఆ కన్నులలో పుట్టినవమ్మా..
అన్నీ అందాలూ..
అందుకె మరులున ..
వెంటబడిన మాకందని ..వాడమ్మా..
వాడూ...అల్లరీ వాడమ్మా..
యమునా తటిలో ..
మా మనసులలో..
మరులను రేపీ..
మరగిన వాడమ్మా..
ఎంత వెదకినా..
అగుపడడమ్మా..
కరుగని వాడమ్మా..
వాడు..కపటపు వాడమ్మా..
యమునా తటిలో..
మునులకు.. గినులకు ముసుగూ వేసి..
మురిసెడివాడమ్మా..
మొగిని అష్టాక్షరి మంత్రములోనే..
వెలసెడు వాడమ్మా..
మాకూ కొలిచెడు వాడమ్మా..
యమునా తటిలో..
ఉప్పొంగకువె .. యమునా....
ఉప్పెనగ నీవిపుడు..
ఉర్విపై శీవాసు..
డుద్భవంబైనాదు..
ఉప్పొంగకువె..యమునా....
తరువులన్నియు సుమకదంబములు..భూమిపై..
జల జలమటంచు..వెన్నెలవోలె రాల్చినవి..
హరిణంబులుల్లాస భరిత హృదయములతో..
గల గలని ఆకులతో కడు చౌకళించినవి..
ఉప్పొంగకువె యమునా....
విసనకర్రలబోలు పించములు విప్పుళుగ..
నెమళులన్నియు గలసి నాట్యంబులాడినవి..
ప్రతి తృణము సంతోష భరితమై తూగినది..
బ్రహ్మాండమంతటా..పట్టనీ ఆనంద..
ముప్పొగకువె యమునా..
పాడు కంసుడు తరిమి వచ్చునో యేమొయని..
వసుదేవుడీవైపు వచ్చుచున్నాడే..
అహ్టాక్షరీస్వామి ఆనందమయుడమ్మా..
ప్రేమామృతం వాని పెదవి కొసలనమ్మా..
ఉప్పొంగకువె యమున..ఉప్పొంగకువె .. యమున..
ఉప్పెనగ నీవిపుడు..
No comments:
Post a Comment