Thursday, June 23, 2011

కాలం...


మరు హజారమ్ములై..

పుప్పొడులు వెదజల్లు..

విరి పొదలలో గరిమలే..

యవ్వనాలై..

చలిత లతాంత కాంతులనుబోలు..

చందురుని వన్నెలే..

ఎలనవ్వులై..

సొలసి సోగలుబోయి..

సొంపిల్లు భావాలు..

సంఫుల్ల మానస విహాయసాలకు సంకేతాలై..

హొయలొలికి నిలిచింది కాలం..

సృస్టించింది మత్తైన మహేంద్రజాలం..


సమయంలో ప్రచురితం..

4 comments:

Dr. Puttaparthi Nagapadmini said...
This comment has been removed by a blog administrator.
Anil Piduri said...

ఫొటోలు సొగసులు విరియ,
మీ కవితలు సౌదామినులు అనూరాధగారూ!
హజారమ్ములు ,
సంఫుల్ల మానస విహాయసాలు,
మహేంద్రజాలం.......
Nice Telugu words!

Anil Piduri said...

అనూరాధగారూ!
లతాంత సోయగాలు
మీ కవితలలో గమకాలు ఒలికిస్తూన్నాయి
(konamanini/ kadambari)

పుట్టపర్తి సాహితీ సుధ - పుట్టపర్తి అనూరాధ said...

అనిల్ గారు..థాక్సండీ..అయ్య ప్రభావం ఆరాధన అంతే ..
కవిత్వమొక వేదన.. ఫలితం హృదయ పారవశ్యం అంతే..